లోకేశ్ కనకరాజ్ అందించబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా కూలీ. బోలెడు మంది స్టార్స్ నటించిన సినిమా. ఆల్మోస్ట్ అన్ని భాషల నుంచి ఎవరో ఒక క్రేజీ స్టార్ ఈ సినిమాలో ఉన్నారు.
రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, శృతి హాసన్, పూజా హెగ్డే ఇలా చాలా పేర్లు ఉన్నాయి చెప్పాలంటే. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలవుతుంది. అందుకే తెలుగు హక్కుల కోసం పోటీ మొదలైంది.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో పంపిణీ చేయాలని రెండు మూడు పెద్ద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆసియన్ సినిమాస్ సునీల్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ ప్రధానంగా పోటీ పడుతున్నారు. తెలుగు హక్కులకు 40 కోట్లకు పైగా స్ట్రెయిట్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల ఎవరు ఇకపై బేరం చేసినా 40 కోట్లు దాటి బేరం చేయాల్సిందే.
ఇటీవలే సూర్య నటించే రెట్రో సినిమాకు కూడా గట్టి పోటీ పడింది. దాదాపు 9 కోట్లకు తెలుగు హక్కులు సితార సంస్థ తీసుకుంది. గతంలో లియో తెలుగు హక్కులు, దేవర థియేటర్ హక్కులు తీసుకున్న సితార సంస్థ ఇప్పుడు రెట్రో, కూలీ సినిమాల తెలుగు హక్కుల మీద కన్నేసి, టాప్ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్లకు గట్టి పోటీ విసురుతోంది.
Waiting
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
ఈ సినిమాతో నిర్మాతలు కూలీలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది