2 వారాల్లో ప్రకటన అన్నాడు.. ఏమైంది?

ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ పూర్తయింది, డైలాగ్ వెర్షన్ కూడా రెడీ అయింది. మరో 2-3 వారాల్లో అధికారికంగా ప్రకటిస్తాం

అందుకే పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు హడావుడిగా ప్రకటనలు చేయరు. ఎక్కడ, ఎప్పుడు, ఏ దశలో లేట్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు చెప్పలేరు. అనీల్ రావిపూడి, చిరంజీవి ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే జరుగుతోంది.

“ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ పూర్తయింది, డైలాగ్ వెర్షన్ కూడా రెడీ అయింది. మరో 2-3 వారాల్లో అధికారికంగా ప్రకటిస్తాం.” గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా అనీల్ రావిపూడి ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది.

కానీ అతడు చెప్పినట్టు జరగలేదు. ఎందుకంటే, అక్కడున్నది చిరంజీవి. 150కి పైగా సినిమాల అనుభవం ఉన్న చిరంజీవి స్క్రిప్ట్ విషయంలో ఓ పట్టాన సంతృప్తి చెందరు. ఇప్పుడదే జరుగుతోంది. అంతా అయిపోయిందనుకున్న ఈ స్క్రిప్ట్ పై రీ-వర్క్ మొదలైంది.

కథలో కీలకమైన 3 సీక్వెన్సులకు సంబంధించి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పై మళ్లీ కూర్చున్నారు. ఒక్కో సీక్వెన్స్ కు 3-4 వెర్షన్లు రాసుకున్నారు. ప్రస్తుతానికైతే ఫస్టాఫ్ మీద మాత్రమే పని చేస్తున్నారు. ఇదీ చిరు-రావిపూడి ప్రాజెక్టుపై లేటెస్ట్ స్టేటస్.

ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని నిర్మాత కూడా ప్రకటించారు. కానీ ఆ టైమ్ కు బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అవుతుందా అనేది అనుమానం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చిరంజీవితో సహా, అందరి టార్గెట్ ఒకటే. అదే ‘సంక్రాంతి రిలీజ్”.

5 Replies to “2 వారాల్లో ప్రకటన అన్నాడు.. ఏమైంది?”

Comments are closed.