సరైన కథకు కాస్త ఫాంటసీ టచ్ ఇస్తే అది వేరుగా ఉంటుంది. ఆ ఫాంటసీకి కాస్త మైథలాజికల్ టచ్ ఇస్తే ఇంకా కిక్కు ఇస్తుంది. కార్తికేయ 2, హనుమాన్, కల్కి లాంటి సినిమాలు ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాయి. కార్తికేయ 2 లో అనుపమ్ ఖేర్ ఎపిసోడ్, హనుమాన్ లో క్లైమాక్స్, కల్కి లో కర్ణ ఎపిసోడ్ ఇలా చిన్న మ్యాజిక్ టచ్‌తో బ్లాక్‌బస్టర్ అయ్యాయి.
హీరో నిఖిల్ ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. స్వయంభు అనే ఈ సోషియో-ఫాంటసీ సినిమాను టాగోర్ మధు చాలా భారీగా నిర్మిస్తున్నారు. బహుశా నిఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే కావచ్చు. భరత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా లైన్, లెంగ్త్, కథ, కమామిషూ అన్నది బయటకు పెద్దగా రాలేదు. కానీ సినిమా ఫుల్ సీజీ వర్క్స్ తో భారీగా ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో రామసేతు ఎపిసోడ్ కూడా ఉంటుందని, అది కీలకమైనదిగా ఉంటుందని సమాచారం. భారతదేశం-శ్రీలంకకు మధ్య శ్రీరాముడు నిర్మించిన వారధినే రామసేతు. ఇది పుక్కిటి పురాణం కాదని, సముద్ర గర్భంలో రామసేతు అవశేషాలు, ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని ప్రూవ్ అయింది. దీని మీద బోలెడన్ని పరిశోధనలు, పుస్తకాలు వచ్చాయి.
స్వయంభు సినిమాలో ఈ రామసేతు కు సంబంధించిన సీన్లు కొన్ని ఉంటాయని తెలుస్తోంది. వాటిని సీజీ లో రూపొందించే పనిలో ఉన్నారు. సినిమా ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయింది. సీజీ వర్క్స్ జరుగుతున్నాయి. మే లేదా జూన్ లో సినిమాను భారీగా విడుదల చేయనున్నారు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Good movie
Actually Ramsethu is a mid-oceanic ridge.. linked up with Ramayan background…