రాజాసాబ్.. మరొక్క యాభై రోజులు

అన్నీ కలిపి యాభై నుంచి అరవై రోజులు వర్క్ వుంది రాజాసాబ్ కు. మరి దసరా కు విడుదల సాధ్యం అవుతుందో కాదో?

ప్రభాస్- మారుతి- పీపుల్స్ మీడియా సినిమా రాజాసాబ్. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది.. వర్క్ ఎంత వరకు వచ్చింది అన్నది క్వశ్చను. అయితే ఈ సినిమా వర్క్ అన్నీ కలిపి మరో యాభై రోజులు వుందన్నది ఆన్సరు. విషయం ఏమిటంటే టాకీ అంతా పూర్తయింది. ప్యాచ్ వర్క్ కు ఓ పది రోజులు కావాలి. మరి మిగిలిన రోజులు దేనికి అంటే..

కేవలం పాటలకు ఓ ముఫై రోజుల వరకు అవసరం పడుతోందని తెలుస్తోంది. సినిమా నిడివి మూడున్నర గంటలు వచ్చిందని గతంలోనే వెల్లడించాం. ఇప్పుడు అది కోత కోయాలి. అలా కోయాలంటే లింక్ సీన్లు దెబ్బతింటాయి. అందుకోసం కొన్ని సీన్లు షూట్ చేసి, లింక్ లు కలిపి, నిడివి ని తగ్గించాల్సి వుంది. దాని కోసం ఓ పది రోజులు కావాలి.

సినిమాలో పాటల చిత్రీకరణ ఇంకా పెండింగ్ లో వుంది. మొత్తం పాటల చిత్రీకరణకు ముఫై రోజులు అవసరం పడుతుందని తెలుస్తోంది. అంటే ఇలా అన్నీ కలిపి యాభై రోజులు వర్క్ వుంది. అయితే ఇక్కడ మరో పాయింట్ కూడా వుంది. సినిమాలోని ఓ కీలకఫైట్ వచ్చిన తీరుపై హీరో ప్రభాస్ కాస్త అసంతృప్తి వ్యక్తంచేసి, కొంత పార్ట్ రీ షూట్ పెట్టమని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇలా అన్నీ కలిపి యాభై నుంచి అరవై రోజులు వర్క్ వుంది రాజాసాబ్ కు. మరి దసరా కు విడుదల సాధ్యం అవుతుందో కాదో?

4 Replies to “రాజాసాబ్.. మరొక్క యాభై రోజులు”

  1. ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డాడని టాక్, ఇటలీ లో ట్రీట్మెంట్. 60 డేస్ బెడ్ రెస్ట్.

Comments are closed.