టికెట్ రేట్లు కామన్ మాన్‌కు అందుబాటులో వుండాలి అన్నది జనం మాట. ప్రతి సినిమాకు టికెట్ రేట్లు అదనంగా పెంచుకుంటూ వెళ్లిపోతే జనం థియేటర్ కు దూరం అయిపోతారు. ఇది థియేటర్ యజమానులే చెప్పే మాట. కానీ నిర్మాతలు వినరు. వాళ్లకు తొలివారంలోనే పెట్టుబడి వెనక్కు వచ్చేయాలి. బయ్యర్లు కూడా సర్లే అదే బాగుంది అనుకుంటున్నారు. ఇదిలా సాగిపోతోంది.
జగన్ ప్రభుత్వం ఏపీలో తొలిసారి టికెట్ రేట్లను డ్రాస్టిక్‌గా తగ్గించారు. ఇది ఇండస్ట్రీలో కల్లోలానికి దారి తీసింది. కావాలని ఇండస్ట్రీ మీద కసితో జగన్ ఇలా చేస్తున్నారనే విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలను పాడుచేయడానికి ఇలా చేస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. తరువాత ఇండస్ట్రీ నుంచి వినతులు వెళ్లడం, రేట్లను కొంత వరకు సవరించడం జరిగింది. ఆ రేట్లు సరిపోతాయని ఎగ్జిబిటర్లు అప్పట్లో భావించారు కూడా.
కానీ ప్రభుత్వం మారిన తరువాత మళ్లీ ప్రతి సినిమాకు రేట్ల పెంపు అడగడం, పెంచడం మామూలైపోయింది. దాంట్లో పెద్ద, ఈవెంట్ సినిమాలు ఆడుతున్నాయి. చిన్న సినిమాలు అంటే జనం థియేటర్ కు దూరంగా వుంటున్నారు.
ఇదిలా వుంటే తెలంగాణలో రేట్లు కాస్త ఎక్కువే వున్నాయి. పైగా స్పెషల్ షోలు, ప్రీమియర్లు అంటూ అదనపు రేట్లు వసూలు చేస్తున్నారు. దీని మీద చాలా డిస్కషన్లు కోర్టు కేసులు కూడా వున్నాయి. ఇక్కడ కూడా రేట్లు రీజనబుల్ గా చేస్తే బాగుంటుంది అనే వాదనలు బలంగా వున్నాయి.
ఇప్పుడు కర్ణాటక అదే దారిలోకి వచ్చింది. ఇన్నాళ్లూ కర్ణాటకలో రేట్లు అన్నది థియేటర్ ఇష్టం. ఒక పరిథిలో టికెట్ రేట్లను నిర్ణయించుకునే హక్కు థియేటర్లకే వుంటూ వస్తోంది. అక్కడ కూడా రాను రాను థియేటర్ ఆదాయం తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ థియేటర్ అయినా రెండు వందలే టికెట్ అనే నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
సహజంగా ఇది సినిమా ఇండస్ట్రీకి రుచించదు. కానీ ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా థియేటర్ నిర్వహణ ఖర్చులు, నిర్మాత లాభం, ప్రేక్షకుడి సౌకర్యం అన్నీ కలిసి మ్యాచ్ అయ్యేలా రేట్లు వుండాలి తప్ప భారీగా అయితే వుండకూడదు. ఈ దిశగా ప్రభుత్వాలు, పరిశ్రమ కలిసి నిర్ణయం తీసుకోవాలి.
Syo
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
₹200/- అనేది చిన్న మొత్తమా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ₹20/- నుండీ ₹30/- మాత్రమే ఉండాలి. అప్పుడే జనం సినిమాలను మళ్ళీ ఆదరిస్తారు.
అభిమానులొప్పుకోరు. 1500/ టికెట్ ధర పెట్టినా చూశారు . చూస్తారు. AP Dy. CM సెలవిచ్చినట్లుగా GSTకూడా వస్తోంది. ఆల్ హాపీస్!!
ఇరవై ముప్పై టికెట్స్ పెట్టీ నీకు ac dts adee praime location lo కాస్ట్లీ building కట్టి,
అసలు వర్కవుట్ అవుద్దా..
కావాలంటే మీ సిమెంట్ ఆంటీ నీ బస్తా 20 రూపాయలకు అమ్మమను
జనాలు బాగుపడతారు
ఇరవై రూపాయలు పెడితే చే..క్లా.. గాడి
పే.. డి మొహం లెక్కన థియేటర్లు తయారవుతాయి.
Nanna kastha padhi tini tinaka gathi leni family lo enno lakhs vunnayi , kaani veella children’s fans ani vela rs tickets ki cinemala perutho divala tiyisthunnaru family la sucide ki reason avuthunnaru appulu paalu ayyi