రాజుగారి వారసురాలు రెడీనా?

వారసులకు రాజకీయంగా లక్కీ చాన్స్ దక్కుతున్న ఈ తరం పాలిటిక్స్ లో రాజు గారి కుమార్తె కూడా పొలిటికల్ గా అరంగేట్రం చేసినా చేయవచ్చు అని అంటున్నారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితమైన పేరే. ఆయన బీజేపీ తరఫున శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ ఆయన ఆ బాధ్యతలు చూశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉత్తరం నుంచి గెలిచిన రాజు కూటమి నుంచి బీజేపీ కోటాలో మంత్రి పదవిని ఆశించారని ప్రచారంలో ఉంది. అయితే ఒకే ఒక మంత్రి పదవి సత్యకుమార్ యాదవ్ కి దక్కింది. జనసేనకు నాగబాబుతో కలిపి నాలుగు మంత్రి పదవులు దక్కే సూచనలు ఉన్నాయి. బీజేపీకి మాత్రం ఒక్కటేనా అన్నది బీజేపీ వర్గాలలో అసంతృప్తిగా ఉంది.

గోదావరి జిల్లాల నుంచి విశాఖ వచ్చి ఉత్తరం నుంచి రెండు మార్లు గెలిచిన రాజు గారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేకపోతే ఆయన వారసురాలు రంగంలో ఉంటారని ప్రచారం సాగుతోంది. ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసిన రాజు గారు ఈ సందర్భంగా తన కుమార్తెను కూడా పరిచయం చేయడం గమనార్హం.

వారసులకు రాజకీయంగా లక్కీ చాన్స్ దక్కుతున్న ఈ తరం పాలిటిక్స్ లో రాజు గారి కుమార్తె కూడా పొలిటికల్ గా అరంగేట్రం చేసినా చేయవచ్చు అని అంటున్నారు. విశాఖ ఉత్తరంలో బీజేపీ జెండాను గట్టిగా పాతిన రాజు తన కష్టాన్ని రాజకీయ అదృష్టాన్ని వారసురాలికి బదిలీ చేయడం ద్వారా ఆమెని లీడర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా తప్పు ఏమీ లేదని అంటున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉంది. అయితే కూటమిగానే మళ్లీ టీడీపీ- జనసేన- బీజేపీ పోటీ చేస్తాయని పెద్దలంతా అంటున్న క్రమంలో అదే జరిగితే పొత్తులలో భాగంగా మరోసారి ఉత్తరం టికెట్ రాజు గారి ఇంటికే అని అంటున్నారు.

4 Replies to “రాజుగారి వారసురాలు రెడీనా?”

  1. ఒకప్పుడు క్షత్రియులని మాత్రమే రాజులానే వాళ్ళు…కలికాలం లో ఎవడైనా!

    1. అవును, రెడ్డి కానివాళ్ళు కూడా రెడ్డి తోక తగిలించుకొని మేము రెడ్లమని బిల్డ్ అప్ ఇచ్చినట్లు కదా?

Comments are closed.