టాలీవుడ్ లో ఏదయినా నడుస్తుంది కానీ, డిసిప్లిన్ లో తేడా వస్తే కష్టం. ఈ సంగతి తెలుసో తెలియదో కానీ, మళయాల కుట్టి అనుపమ వ్యవహారం మాత్రం టాలీవుడ్ జనాలకు అంతగా మింగుడు పడడం లేదు. రామ్ చరణ్ తో సినిమా వుందీ అని ట్వీట్ చేసింది ఆమే.
లేకపోయిన తరువాత ''.. ఏదైనా మనమంచికే, మరింత మంచి దానికే ఇది దారి తీస్తుంది..' అనే టైపులో ట్వీట్ లు చేస్తోంది. అంటే ఇది మంచిది కాదని అర్థం తీసుకుంటే సహజంగానే ఇటు డైరక్టర్,అటు హీరో ఫీలయ్యే అవకాశం వుంది. అంతే కాదు, అసలు ఇంకా చేయాలా? వద్దా? అన్నది ఊగిసలాడుతుంటే, చేయకూడదని డిసైడ్ చేసేసుకుని, ఆమే కొన్ని వెబ్ సైట్ లకు లీక్ ల ఇప్పించిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంకా డిసైడ్ కాకుండానే వార్తలు రావడం చూసి, ఇంక మరెందుకు ఆలస్యం అని యూనిట్ డిసైడ్ అయిపోయిందట. హీరోయిన్ ఇలా నేరుగా లీకులు ఇవ్వడం, ఇలా ట్వీట్ లు చేయడం పై ఇండస్డ్రీలో జనాలు గుసగుసలు పోతున్నారు. ఇలాంటి పద్దతి కెరీర్ కు మంచిద కాదని, ఇండస్ట్రీలో పదికాలాలు వుండాలంటే, కాస్త పద్దతిగా, గుట్టుమట్టుగా వుండాలని, అంతే కానీ, తానే ఫీలర్లు వదలడం చేస్తే,హీరోలు, నిర్మాతలు పక్కన పెడతారని కామెంట్లు వినిపిస్తున్నాయి.