టాలీవుడ్ లో అసలే డైరక్టర్ల కొరత ఎంతో వుంది. కథల కొరత అంతకన్నా భయంకరంగా వుంది. డైరక్టర్ విత్ స్టోరీ దొరికితే ఎగరేసుకుపోతున్నారు. కానీ అదే సరైన స్టోరీ లేకుంటే ఎలాంటి డైరక్టర్ అన్నా వెనక్కు తగ్గాల్సిందే. పాపం, డైరక్టర్లు నందినీ రెడ్డి, ఇంద్రగంటి మోహన కృష్ణ ఇలాగే మంచి ఆపర్లు మిస్ చేసుకున్నారు.
ఇంద్రగంటి-సాయి కొర్రపాటి కాంబినేషన్ కు ఓకె అన్నాడు నాగ్ చైతన్య. కానీ చైతూను ఇంప్రెస్ చేసే కథ చెప్పలేకపోయాడు డైరక్టర్ ఇంద్రగంటి. దాంతో నాగ్ చైతన్య సారీ చెప్పేసాడు. గోల్డేన్ చాన్స్ చేజారి పోవడంతో ఇంద్రగంటి మళ్లీ వెనక్కు వచ్చి అవసరాల, అడవిశేష్ లాంటి చిన్న హీరోలతో చేస్తున్నారు.
ఇక నందినీ రెడ్డి సంగతి అలాంటిదే. కళ్యాణ వైభోగమే లాంటి ఫరావాలేదు అనిపించుకునే సినిమా చేసారు ఆమె. కానీ ఆ సినిమా తరువాత మళ్లీ ఆ నిర్మాత సినిమా స్టార్ట్ చేయలేకపోయారు. నందినీకి పిలిచి మరీ చాన్స్ ఇచ్చారు హారిక హాసిని సిస్టర్ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ జనాలు. కానీ అక్కడా ఆమె ఎంత ప్రయత్నించినా సరైన కథ చెప్పలేకపోయారు.
దాంతో ఇప్పుడు ఆ ప్రాజెక్టు కూడా చెట్టెక్కేసినట్లే. వేరే డైరక్టర్, వేరే కథ, డైరక్టర్ దొరికితే ప్రాజెక్టు చేద్దామని చూస్తున్నారు వాళ్లు. పాపం ఇద్దరు డైరక్టర్లు మళ్లీ మంచి బ్యానర్లు, మంచి హీరో లను పట్టుకోవాలంటే ఎన్నాళ్లు పడుతుందో?