అంత ఆశ్చర్యమెందుకు.. మగాడేగా.. ఎప్పుడో అప్పుడు చేసుకోవాల్సిందే కదా అని కంగారు పడి కామెంట్ చేయద్దు. మనుషులందు సెలబ్రిటీలు వేరయా అన్నారు. సెలబ్రిటీల పెళ్లంటే న్యూస్. హీరోల మ్యారేజ్ అంటే ఆసక్తి. అందులోనూ అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకుంటే అది వేరే సంగతి. పెళ్లి చేసుకున్నా ఎవరికీ తెలియకుంటే అది వేరు.
ఒక్క సినిమాతో తనదైన మాట.. నటనతో యువతకు దగ్గరైపోయాడు నవీన్ పోలిశెట్టి. అలా అని తామరతంపరగా సినిమాలు సైన్ చేసేసి, ఏ కథ దొరికితే చాలు సినిమా స్టార్ట్ చేసేయలా.. రెండో సినిమా చేసిన తరువాత ఏళ్ల తరబడి ఖాళీగా వున్నాడు తప్ప సినిమా స్టార్ట్ చేయలేదు.
అలాంటి నవీన్ పోలిశెట్టి పెళ్లి రహస్యంగా జరిగిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలో వుంటున్న అమ్మాయిని అక్కడే పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. ఇది జరిగి చాలా నెలలు అయిందని తెలుస్తోంది.
మిస్ శెట్టి.. మిస్టర్ శెట్టి విడుదల టైమ్ లో అమెరికా వెళ్లిన నవీన్ పోలిశెట్టి అక్కడే వుంటున్నాడు. ఇక్కడకు రావడం లేదు. అప్పట్లోనే చిన్న ప్రమాదం జరిగింది. చేతికి దెబ్బతగిలింది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ చేతికి కట్టుతోనే వుంటున్నా అని మొన్నామధ్య ఓ వీడియో కూడా వదిలారు. తరువాత అప్పటికప్పుడే చటుక్కున ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో కనిపించారు.
మరి వెంటనే మళ్లీ అమెరికా వెళ్లారో, ముంబాయి వెళ్లారో తెలియదు కానీ, ఈ పెళ్లి వార్త తెలిసింది. మరి నిజంగా పెళ్లి జరిగి, దాచి పెట్టారో. లేదా ఎంగేజ్ మెంట్ మాత్రమే అయిందో తెలియాల్సి వుంది.
కెరీర్ లో సెటిల్ అయిన తరువాతే
ఇదిలా వుండగా ఈ విషయాన్ని నవీన్ పోలిశెట్టి దగ్గర ప్రస్తావించగా, కెరీర్ లో బాగా సెటిల్ అయిన తరువాతే పెళ్లి అని, ఇది వట్టి రూమర్ అని అన్నారు. పెళ్లి చేసుకుంటే ముందుగా మీడియాకే తెలియచేస్తా అని అన్నారు. ప్రస్తుతం మూడు స్క్రిప్ట్ లు రెడీ అవుతున్నాయని, దృష్టంతా వాటి మీదనే అని నవీన్ చెప్పారు.
హీరోయిన్స్ పెళ్లి విషయం సీక్రెట్ గా ఉంచుతారు అని విన్నా, కానీ హీరోస్ కూడా దాచుతారని ఇపుడే వింటున్నా.
shanti ki vijayam dorukutundaa ?
A marriage is a private affair, why talking about their personal issues?
why are you reading the article even after reading the title?
Vc available 9380537747
Vc available 9380537747
Vc 9380537747
జనం పట్టించుకోరు
అవ్వక పోతే నువ్వు సంబంధాలు చూస్తావా ?