రోజా డ్రెస్‌పై నీకెందుక‌య్యా?

త‌మ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామ‌ని కూట‌మి పెద్ద‌లు త‌ర‌చూ చెబుతుంటారు. ఒక ద‌ళిత మ‌హిళ‌కు హోంమంత్రిత్వ శాఖ‌ను అప్ప‌గించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత వ‌ర‌కూ అంతా బాగా వుంది.…

త‌మ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామ‌ని కూట‌మి పెద్ద‌లు త‌ర‌చూ చెబుతుంటారు. ఒక ద‌ళిత మ‌హిళ‌కు హోంమంత్రిత్వ శాఖ‌ను అప్ప‌గించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత వ‌ర‌కూ అంతా బాగా వుంది. అయితే ఏ ప్ర‌భుత్వానికైనా చ‌ర్య‌లే ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుతాయి.

తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా డ్రెస్‌పై టీడీపీ అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ఎక్స్ వేదిక‌గా వెట‌కారం ప్ర‌ద‌ర్శించారు. సూప‌ర్ అక్కా అంటూ ఆమె ఫొటోను షేర్ చేస్తూ వ్యంగ్య కామెంట్ చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఆర్కే రోజా ఇటీవ‌ల ఇట‌లీ దేశానికి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విహార యాత్ర‌కు వెళ్లారు. ఆ సంద‌ర్భంలో ఆమె ధ‌రించిన డ్రెస్‌పై ఆనం కామెంట్ చేయ‌డం విచిత్రంగా వుంది.

రోజా రాజ‌కీయాల‌పై ప్ర‌త్య‌ర్థులుగా ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా అభ్యంత‌రం ఉండ‌దు. కానీ మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త వ‌స్త్రధార‌ణ‌పై అధికార ప్ర‌తినిధి స్పందించ‌డం మంచిది కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయాల్లోకి మ‌హిళ‌ల రావ‌డ‌మే త‌క్కువ‌. ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల్లోకి మ‌హిళ‌ల రాక పెరిగింది. ఈ క్ర‌మంలో వాళ్ల వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై కామెంట్స్ చేయ‌డం వ‌ల్ల మ‌హిళ‌లెవ‌రైనా రాజ‌కీయాల్లోకి వెళ్లాలంటే జంకే ప‌రిస్థితి.

ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి గ‌తంలో రోజాపై వ్య‌క్తిగ‌తంగా దారుణ విమ‌ర్శ‌లు చేశారు. అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి ఎన్ని మాట్లాడినా చెల్లుబాటు అయ్యాయి. ఇప్పుడు అలా కాదు. అధికారంలో టీడీపీ వుంది. కావున హుందాగా వ్య‌వ‌హ‌రిస్తే ఆ పార్టీకే మంచిదే. హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత త‌మ పార్టీకి చెందిన నాయకులు మ‌హిళ‌ల‌ను గౌర‌వించేలా సూచ‌న‌లు ఇస్తే బాగుంటుంది.

43 Replies to “రోజా డ్రెస్‌పై నీకెందుక‌య్యా?”

    1. హబ్బే.. రజినీకాంత్ ని “చెడుగుడు” ఆడుకున్న రోజా.. అంటూ అప్పట్లో ఆర్టికల్స్ రాసుకుని శునకానందం పొందారు..

  1. ఏకం గా సాక్షి థంబ్ నెయిల్స్ లో “బొల్లి” అంటూ రాసుకొన్నప్పుడు ఏమైనవి ఈ నీతులు..

    ఈ రోజు వైసీపీ వాళ్ళని అడ్డం గా నరికేస్తున్నా మీకు సింపతీ ఎందుకు రావడం లేదంటే.. కారణం జనాల్లో మీ మీదున్న ద్వేషం.. మీరు చేసిన పాపాలే నేడు మీకు ఈ నేల మీద మీకు తగిన శాస్తి జరగాలని కోరుకొంటున్నారు..

    జగన్ రెడ్డి ని, జగన్ రెడ్డి మనుషులను ఎంత తిట్టినా తప్పు లేదు..

    మనిషి జన్మ లో బతుకుతున్న రాక్షసులు..

  2. అస్సలు డ్రెస్ గురించి ఏమైనా కామెంట్ చేశాడా? ఇంత పెద్ద సోది? రెండు నెలలకే మైండ్ బ్లాంక్ అయ్యిందా?

  3. అస్సలు డ్రెస్_గురించి ఏమైనా కామెంట్_చేశాడా? ఇంత పెద్ద_సోది? రెండు నెలలకే మైండ్_బ్లాంక్ అయ్యిందా?

  4. అస్సలు డ్రెస్_గురించి ఏమైనా కామెంట్_చేశాడా?మర్యాద గా ‘అక్కా సూపర్’ అన్నాడంతె, ఏం_బూతు_కనిపించింది GA కు?. GA ku రెండు నెలలకే మైండ్_బ్లాంక్ అయ్యిందా?

  5. ఈ లైన్ ఓ సారి చూడండి రైటర్ గారు… రోజా రాజ‌కీయాల‌పై ప్ర‌త్య‌ర్థులుగా ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా అభ్యంత‌రం ఉండ‌దు అని రాశారు. మరి పవన్ కళ్యాణ్ రాజకీయాలపై విమర్శలు చేశారు సరే.. ఆయన పెళ్ళిళ్ళ సంగతి వైసీపి వాళ్ళకి ఎందుకు. ఆయన మాజీ భార్యలు కేసులు పెట్టి మీడియా ముందుకి వచ్చారా లేదుగా.. మరి జగన్ గారు కూడా రాష్ట్రంలో అదొక్కటే సమస్య అన్నట్లుగా ఎందుకు మాట్లాడారు. అప్పుడు మీ గ్రేట్ ఆంధ్రా ఎందుకు ఖండించలేదు. పైగా మీరు కూడా ఆయన పెళ్ళిళ్ళపై రాశారు కదా.. అంటే ఇదంతా మీకందిన ప్యాకేజీ మహిమేనా..! కాబట్టి గురివింద గింజ స్టోరీలు రాయకండి.

  6. ఎం నాయన , ఆర్టికల్ బాగా రాసావు , మరి ఇదే ఆర్టికల్ , చెల్లి కట్టుకున్న చీర రంగు గురించి అన్న మాట్లాడినప్పుడు రాయకపోయావ్ ?

  7. Roja ! criticised Akhila priya for wearing kurta chudidar, and asked why she is not wearing saree, saying wearing kurta chudidar is against sampradayam” . Anam criticism roja for wearing frock, should be seen in this context

    1. Okati thelusukondi pk sudha pusa kaadhu, Roja sudha poosa kaadhu, dhorakantha varaku andharu dhorale, politics vimarsalu prathi vimarsalu vuntayi ,pk kuda Rahul Gandhi ni annadu ,” Pelli kaaledhu kani Brahmachari Kaadhu” .vaalu adhikaram lo ki raavadaniki anno kaaranalu cheppi gelicharu” .power lo ki vochaka janalaki emi cheyyali ani alochinchali .kutami adhikari prathinidhi idhi Roja ala annadhi kabatti memu kuda antam ante valaki veelaki Theda vundadhu.antha andhuku pk pracharam lo emi chepparu,”volunteers women trafiquing chesthunnaru ani” adhi vochi 3 months ayyindhi investigation ki aadhesinchara?.ivanni politics kosam maatladutharu.leave it

  8. సొంత సెల్లి చీర మీద కామెంట్ చేసినప్పుడు చెప్పాల్సింది ఈ సుద్దులు…కనీసం ప్రతిపక్ష హోదా అన్న దక్కేది

  9. సొంత సెల్లి చీర మీద కామెంట్ చేసినప్పుడు చెప్పాల్సింది ఈ సుద్దులు…కనీసం ప్రతిపక్ష హోదా అన్న దక్కేది

  10. “సొంత “సెల్లి “చీర “మీద “కామెంట్ “చేసినప్పుడు “చెప్పాల్సింది “ఈ సుద్దులు…”కనీసం “ప్రతిపక్ష “హోదా “అన్న “దక్కేది

  11. ఆడవారు రెగ్యులర్ గా వేసుకొనే పంజాబీ డ్రెస్సులు గురించి నంద్యాల ఉపఎన్నికలు ఏదో వాగినట్లు ఉంది ఈ రోత మేడమ్ అప్పట్లో ..అప్పుడు అనిపించలేదా నీకు ..

  12. ఇతగాడు కొంచం కోడలి నాని లా అనిపిస్తాడు. నోటికి అదుపు లేదు. కాకి లా అరుస్తుంటాడు. చాల వెకిలి మనిషి. కోడలి ఇప్పటికే అందరూ అసహ్యించుకుంటున్నారు .. అలాగే ఈ ఆనం గారిని ప్రజలు ఏవగించుకుంటున్నారు. టీడీపీ పబ్లిక్ ఇమేజ్ దెబ్బ తీసేవాళ్ళలో ఇతడు ముందు వరసలో ఉంటాడు.

  13. ఒకప్పుడు ఇదే రోజా భూమ ఆఖిలప్రియ వస్త్రధారణ మీద కామెంట్స్ చేసింది. అఖిల నిండుగా శల్వార్, కమీజ్ వేసుకొస్తే “మన సంప్రదాయం చీరని వదిలేసి, మగరాయుడిలాగా శల్వార్, కమీజ్ వేసుకొస్తావా?” అంది ఆ పంది. అవి కూడా భారతీయ సంప్రదాయమే అని తెలీదు రోజాకి. వంగలపూడి అనిత మీద కూడా ఇలాంటి కామెంట్సే చేసింది. ఈమెకి సానుభూతి అనవసరం.

  14. Covid19 wave లో Exam Fee కట్టిన Students అందరూ Pass-out అయినట్లు ఈయన గారు కూడా కూటమి wave లో Pass అయ్యాడు. లేకుంటే ఇలాంటి ఆలోచన విధానం ఉన్న మనిషిని ఎలా ఎన్నుకుంటారు.

  15. స్త్రీ వస్త్రధారణ గురించి ఇలా Comments చేయడం మంచి సాంప్రదాయం కాదు.

Comments are closed.