పుష్ప 2 అసలు టార్గెట్ అదేనా?

మండే నుంచి రేట్లు తగ్గిస్తారు, థియేటర్లు తగ్గిస్తారు కనుక కచ్చితంగా ఫుల్స్ కనిపించే అవకాశం వుంది. అలా కనిపించకపోతే మాత్రం అప్పుడు కచ్చితంగా సినిమాను అనుమానించాల్సిందే.

పుష వన్ అనుకోని హిట్ నార్త్ బెల్ట్ లో. ఇప్పుడు పుష్ప 2 కూడా నార్త్ బెల్ట్ లో పెద్ద హిట్ అయ్యే దిశగా వెళ్తోంది. సినిమా ప్రీమియర్లు ముగిసిన తరువాత రకరకాల టాక్ లు వచ్చినా సాయంత్రానికి వీలయినంత పాజిటివ్ టాక్ నే ఎక్కువగా మిగిలింది. కానీ ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో టికెట్ రేట్ల మీద చాలా అంటే చాలా ఎక్కువ ప్రచారం జరిగిపోయింది. మామూలుగా రేట్లు పెంచి వుంటే ఇంత రభస జరిగి వుండేది కాదు. తొలిసారి గా అఫీషియల్ బెనిఫిట్ షోలు అనే ఓ ప్రయోగం చేసారు.

నిజానికి ఇది గుంటూరు కారం టైమ్ లోనే వేరే విధంగా ట్రయ్ చేసారు. అప్పుడు కాస్త బ్యాడ్ అయ్యారు. అయితే అది ట్రేడ్ వర్గాల్లో మాత్రమే. అందుకే దేవర టైమ్ లో ఇప్పుడు పుష్ప 2 చేసిన మోడ్ లోనే చేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇరు ప్రభుత్వాలతో నిర్మాణ సంస్థకు వున్న సాన్నిహిత్యంతో సాధ్యమైంది. కానీ అది కాస్తా బ్యాక్ ఫైర్ అయింది. మొత్తం టికెట్ రేట్లు ఎక్కువ అనే ప్రచారం బాగా బలంగా జరిగిపోయింది. దీని వెనుక ఫ్యాన్ వార్ లు ఏ మేరకు వున్నాయన్నది వేరే సంగతి.

ఇదిలా వుంటే సినిమా ప్రీమియర్ల తరువాత కాస్త డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. సినిమాలో బ్లాక్ లు జనాలకు నచ్చాయి. బన్నీ నటన నచ్చింది. కానీ ఫ్లాస్ వున్నాయని టాక్ అయితే సర్వత్రా వచ్చింది. కానీ టోటల్ సినేరియా చూసుకుంటే, నెగిటివ్ ప్రచారం కన్నా కాస్త పాజిటివ్ ప్రచారం నే ఎడ్జ్ తీసుకుంది.

అయితే ఇంకా రూరల్ సెక్షన్ లో ఇంకా ఫుల్స్ కనిపించాల్సి వుంది. కానీ ఈ టికెట్ రేట్లు అనే దాని ప్రభావం వల్ల జనం థియేటర్ కు దూరంగా వున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల సినిమా కచ్చితంగా లాంగ్ రన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రేట్ల సమస్య అన్నది నిజంగా ప్రభావితం చేస్తోంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నది నిజమైతే. కచ్చితంగా మంచి రన్ వుంటుంది.

ఈ టికెట్ల రేట్ల సంగతి కాసేపు పక్కన పెడితే సినిమా మేకింగ్, టేకింగ్, హీరో క్యారెక్టరైజేషన్ ఇవన్నీ టోటల్ గా చూస్తే నార్త్ బెల్ట్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడానికే ఎక్కవ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. హీరో డ్రెస్ సెన్స్, గుట్కా లాంటిది నోట్ల వేసుకోవడం, మందు, ఆయుధాలు, జీపు మీద కూర్చుని తిరగడం ఇలా చాలా అంటే చాలా సీన్లు బీహార్, యుపి బెల్ట్ కుర్రాళ్లను ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్లు అన్నీ పోగేసి తీసినట్లు కనిపిస్తోంది.

కొన్ని కొన్ని సీన్లు మనకు కాస్త ఓవర్ గా అనిపిస్తాయి కానీ నార్త్ బెల్ట్ లోని కొన్ని ఏరియాల ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో వుంచుకుంటే మేకర్స్ ప్లాన్ అర్ధం అవుతుంది. ఇప్పుడు దాని రిజల్ట్ కనిపిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో సినిమా కలెక్షన్లు చాలా బాగున్నాయి. ఇప్పుడు దీని ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాల మీద చూపించే అవకాశం వుంది.

మేకర్లు ఎలాగూ మండే నుంచి రేట్లు తగ్గిస్తారు, థియేటర్లు తగ్గిస్తారు కనుక కచ్చితంగా ఫుల్స్ కనిపించే అవకాశం వుంది. అలా కనిపించకపోతే మాత్రం అప్పుడు కచ్చితంగా సినిమాను అనుమానించాల్సిందే.

20 Replies to “పుష్ప 2 అసలు టార్గెట్ అదేనా?”

  1. అల్లు అర్జున్ గాడి వల్లె నిన్న  హైదరాబాద్ లో * మహిళ & ఆ మహిళ కుమారుడు * చనిపోయారు . ఆమె తొక్కిసలాట లో చనిపోలేదు , అసలు ఆ అల్లు అర్జున్ గాడు రాకముందు జనాలు పదుల సంఖ్యలో ఉన్నారు .. ఎప్పుడు అయితే ఈ అల్లు అర్జున్ గాడు జనాలనీ వేసుకొని వచ్చాడో అప్పుడే తొక్కిసలాట జరిగింది.. వీడు వస్తున్నాడు అని సోషల్ మీడియా గ్రూపు లో షేర్ చేశాడు గాని , పోలిసులుకి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని పోలీసులు లే చెప్పుతున్నారు. ..

  2. ఒ రే య్ గ్యా. స్ గా. …. నీ కు గా నీ &. ఆ అ. ల్లు అ ర్జు న్ గా డి కి గా నీ

    చ ని పో యిన మహిళ గురించి. & ఆ మె కొ డు కు గు రిం చి. బా ధ లే దు .

    అం ద రు ఛీ కొ ట్టి న. చె త్త మూ వీ కీ. వ చ్చి. న ప్ర. జ లా. ర క్తం తో

    త డి సి న. డ బ్బు లు. మా త్ర ము కా వా లి ..

  3. Neeku nijanga jornalist viluvalu or manavatam unte chanipoina mahila gurinchi or aa kutumba paristi gurinchi producers/actors what action they are going to take and why they are silent ani adege article rasava??

  4. First thing brain less Ychief people what every money spending money on movie goes to producers are jagan sena supporters and second movie is boring most of the part as it over the top . Just average movie for few scens with out story .

  5. ఇక్కడ సినిమా తీస్తూ వాళ్ళను ఇంప్రెస్స్ చేయడం ఎందుకు .. డైరెక్ట్ గ భోజపురిలో సినిమాలు తీసుకుంటే సరిపోతుంది ..

  6. ఈ వెబ్ సైట్ వాడు,

    వాడి కులానికి అండగా నిలిచినందుకు,

    అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.

    మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?

    మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.

    ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు

Comments are closed.