ఫ్రస్టేషన్‌లో ప్రశాంత్ వర్మ!

వేరే సినిమా వేరు, బాలయ్య కొడుకు సినిమా వేరు. ప్రశాంత్‌ వదులుకోరు కదా. అంటే అటు నుంచి ఏమైనా జరిగిందా అని పాయింట్లు లాగుతున్నారు.

కారణం ఏదైనా కావచ్చు. సినిమా ఓపెనింగ్‌ వాయిదా పడింది. మంచి సబ్జెక్ట్‌, మంచి నిర్మాత. బాలకృష్ణకు కూడా చాలా ఆసక్తిగా ఉంది ప్రాజెక్ట్‌పై. నిర్మాత సినిమా ఓపెనింగ్‌ కోసం అంతా రెడీ చేశారు. ఖర్చు పెట్టారు. ఇప్పుడు అంతా వృథా అయింది. హీరోకి ఒంట్లో బాగా లేకపోవడంతో సినిమా ఓపెనింగ్‌ వాయిదా పడింది. కొడుక్కు వంట్లో బాలేదని, త్వరలో మళ్లీ మరో ముహూర్తం చూస్తామని బాలయ్య నిన్న కాకినాడలో చెప్పారు. అయినా ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అన్న గ్యాసిప్‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అది వేరే సంగతి.

కానీ ఎక్కువగా ఫోకస్‌ అంతా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మీద పడింది. ఇప్పటికే మైత్రీలో ఓ ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయింది. చేతిదాకా వచ్చిన మంచి ప్రాజెక్ట్‌ అది. హీరోకి, దర్శకుడికి నప్పలేదనే గ్యాసిప్‌ బలంగా వినిపించింది. ఇప్పుడు మోక్షు ప్రాజెక్ట్‌ వుంటే ఫరవాలేదు. లేకపోతే మళ్లీ నింద ప్రశాంత్‌ వర్మ మీదకు వస్తుంది.

మోక్షు సినిమా చేయాలనుకున్నాడు. మేకోవర్‌ అయ్యాడు, సన్నబడి అందంగా మారాడు. ముందు రోజు హెయిర్‌ స్టయిలింగ్‌ చేయించుకున్నాడు. అప్పటికప్పుడే వాయిదా. ఇది కాస్త ఆనుమానాలకు తావిచ్చింది. అక్కడితో ఆగలేదు. ప్రశాంత్‌కు మోక్షుకు మధ్య ఏదో జరిగిందనే గ్యాసిప్‌లు ఇండస్ట్రీలో వినిపించడం ప్రారంభమైంది. వేరే సినిమా వేరు, బాలయ్య కొడుకు సినిమా వేరు. ప్రశాంత్‌ వదులుకోరు కదా. అంటే అటు నుంచి ఏమైనా జరిగిందా అని పాయింట్లు లాగుతున్నారు.

ఇలాంటివన్నీ తెలిసి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఫ్రస్టేట్‌ అవుతున్నారని తెలుస్తోంది. పైగా ఇండస్ట్రీలో ఒకరు అంటే ఒకరికి పడదు. హనుమాన్‌ తరువాత ప్రశాంత్‌ వర్మ గుసగుసల్లో వ్యక్తిగా మారారు. ప్రశాంత్‌ వర్మ పద్ధతి మారిపోయిందని, ఏ సినిమా ఓకే చేసినా, మొత్తం అంతా తన కంట్రోల్‌లోనే జరగాలని, ప్రొడక్షన్‌ తన మనుషులే చేస్తారని, చిన్న పని నుంచి సీజీ పనుల వరకు అన్నీ తన ఆఫీసులోనే జరగాలన్నది కండిషన్‌గా వుంటోందని, ఇలా చెప్పడం వల్ల కొందరు నిర్మాతలు వెనకడుగు వేసారని టాక్‌ ఉంది. అంతేకాదు గతంలో కమిట్‌ అయిన నిర్మాతలకు సినిమాలు చేయకుండా, పెద్ద నిర్మాతలు, పెద్ద స్టూడియోలను ఎంచుకుంటూ, హనుమాన్‌ ముందు ఓకే చేసిన నిర్మాతలను తప్పించుకుంటున్నారని గుసగుసలు ఉన్నాయి.

ఇవన్నీ ఎన్ని ఉన్నా ఫరవాలేదు. ఎదుగుదల నచ్చక ఇలా మాట్లాడుకుంటున్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ రాజమౌళి మాదిరిగా మొత్తం తానే చేస్తా, తన మనుషులే చేస్తారు, తన యూనిట్‌లోనే చేస్తారు. ఇలాంటి కండిషన్లు కాస్త నెగటివ్‌ చేస్తాయి. ఈ సంగతి కూడా ప్రశాంత్‌ వర్మ గమనించుకోవాలి.

ప్రభాస్‌తో సినిమా ఉందని చెబుతున్నారు. అది పక్కాగా ఉండి తీరాలి. లేదంటే ఇక చాలా మాటలు పడిపోతాయి. హీరోలు ఏదో ఉంది… అని ప్రశాంత్‌ వర్మ వైపు వేలు చూపించే అవకాశం ఉంది. అదే ప్రశాంత్‌ వర్మ ఫ్రస్టేషన్‌కు అసలుసిసలు కారణం అవుతుంది.

11 Replies to “ఫ్రస్టేషన్‌లో ప్రశాంత్ వర్మ!”

Comments are closed.