తెలుగు సినిమాకి సంక్రాంతి, దసరా మాదిరిగా దీపావళి అంత ముఖ్యమైన ఫెస్టివల్ కాదు. అందుకే దీపావళికి పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించరు. అయితే దీపావళికి హిందీ, తమిళంలో మాత్రం ఎప్పుడూ భారీ చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా తమిళనాడులో సినిమాలకి దీపావళి మంచి సీజన్.
ఈ దీపావళికి తమిళంలో ఆరంభం, పాండియనాడు, ఆల్ ఇన్ ఆల్ అళగురాజా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో విశాల్ నటించిన పల్నాడు మాత్రమే శనివారం ఇక్కడ రిలీజ్ అవుతోంది. అజిత్ ఆరంభం కానీ, కార్తీ ఆల్ ఇన్ ఆల్ కానీ దీపావళి రిలీజ్‌కి ముందుకి రాలేదు.
తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ ఉంది కానీ సైమల్టేనియస్‌గా తెలుగులో విడుదల చేయడానికి ఎందుకో అతను ముందుకి రాలేదు. అలాగే అజిత్ కూడా చాలా కాలంగా తిరిగి ఇక్కడ ప్రేమలేఖ స్థాయి హిట్ కోసం చూస్తున్నాడు. తమిళంలో సూపర్ క్రేజ్ ఉన్న ఆరంభంని అతను ఎందుకో తెలుగులో ఏకకాలంలో విడుదల చేయాలని చూడలేదు. కారణమేంటనేది ఈ చిత్రాల ఫలితం చూస్తే అర్థమవుతుందేమో.