హిట్ వస్తే ఈగల్లా మూగడం చిత్రపరిశ్రమలో అలవాటే! ఆ హిట్‌ని వీలైనంత క్యాష్ చేసుకొందామని తాపత్రయం. దీనికి కొత్తా, పాతా అనే తేడా లేదు. తాజాగా తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన మేర్లపాక గాంధీపైనా కర్ఛీఫ్‌లు వేసేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకొన్నాడు గాంధీ. ఆ సినిమాని తీర్చిదిద్దిన విధానం అందరికీ ఆకట్టుకొంది. చిన్న కథని.. అందంగా చెప్పాడనే పేరు తెచ్చుకొన్నాడు గాంధీ. బన్నీ కూడా ఈ సినిమా చూసి థ్రిల్ అయిపోయి సందీప్ కిషన్ కి ఫోన్ చేసి అభినందించాడట.
ఇప్పుడు నిర్మాతలు దర్శకుడి వెంట పడుతున్నారు. ఓ హిట్ రాగానే భుజం తట్టడానికి రెడీ అయిపోయే బెల్లంకొండ సురేష్, బండ్ల గణేష్, సురేష్ బాబు… ఈ దర్శకుడికి అడ్వాన్సులు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరి వీరిలో ఎవరి అడ్వాన్స్ అందుకొంటాడో, ఎవరి సినిమాకి ఓకే చెబుతాడో చూడాలి.