కేశవ గుండె ఆగిపోతుందట

హీరో అంటే ఏదో ఓక కాన్సెప్ట్ క్యారెక్టర్ అనుకునే టైమ్ ఇది. సూర్య వెర్సస్ సూర్య, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, ఇలా చాలానే వుంది జాబితా. తాజాగా నిఖిల్ మరోసారి ఓ…

హీరో అంటే ఏదో ఓక కాన్సెప్ట్ క్యారెక్టర్ అనుకునే టైమ్ ఇది. సూర్య వెర్సస్ సూర్య, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, ఇలా చాలానే వుంది జాబితా. తాజాగా నిఖిల్ మరోసారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ క్యారెక్టర్ వేస్తున్నాడు. స్వామిరారా సినిమాతో నిఖల్ కెరీర్ ను రైట్ ట్రాక్ మీద పెట్టిన డైరక్టర్ సుధీర్ వర్మనే ఈ సినిమా రూపొందిస్తున్నాడు. ఇది రివెంజ్ డ్రామా. హీరో పగ తీర్చుకోవడం అంటే, అతని క్యారెక్టర్ లో ఎంత ఎమోషన్ వుండాలన్నది తెలిసిందే. కానీ అక్కడే వుందట కాన్సెప్ట్.

ఏ మాత్రం ఎమోషన్ అయినా హీరో గుండె ప్రమాదంలో పడిపోయి, మరణం సంభవించేస్తుందట. అంటే ఎమోషన్ కాకుండా కూల్ గా వుంటూనే పగ తీర్చుకోవాలన్నమాట. అదీ కాన్సెప్ట్. సో సినిమా అంతా హీరో నవ్వుతూ కనిపిస్తూనే, నవ్విస్తూనే తన పగ ఎలా తీర్చుకున్నాడన్నది సినిమా అంట.

రెండో సినిమా దోచేయ్ తో డిజాస్టర్ చవిచూసాడు డైరక్టర్ సుధీర్ వర్మ. స్వామిరారా లాంటి ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్లే అన్నది ఎక్కడ కనిపించదు ఆ సినిమాలో. మరి ఈసారి రివెంజ్ డ్రామా అంటున్నారు. మరి ఇది రొటీన్ మాస్ మసాలా లా తీస్తారో? లేక తన తొలి సినిమా మాదిరిగా వైవిధ్యంగా, క్లాస్ ఫన్ అండ్ ఎంటర్ టైనర్ గా అందిస్తారో చూడాలి.