ఖైదీకి కూడా ఓవర్ సీస్ కలవరం?

ధృవ సినిమా విషయంలో హీరో రామ్ చరణ్ తన కాన్సన్ ట్రేషన్ అంతా ఓవర్ సీస్ మీదే పెట్టారు. బయ్యర్ లాస్ సంగతి అలా వుంచి, తన వన్ మిలియన్ టార్గెట్ ను పూర్తి…

ధృవ సినిమా విషయంలో హీరో రామ్ చరణ్ తన కాన్సన్ ట్రేషన్ అంతా ఓవర్ సీస్ మీదే పెట్టారు. బయ్యర్ లాస్ సంగతి అలా వుంచి, తన వన్ మిలియన్ టార్గెట్ ను పూర్తి చేసే వరకు అమెరికాలో చాలా హడావుడి చేసి వచ్చారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకు కూడా ఓవర్ సీస్ వన్ మిలియన్ పై దృష్టి పెట్టారట. ఇంత భారీగా హడావుడి చేస్తూ తీసిన సినిమా వన్ మిలియన్ చేయకపోవడం ఏమిటి? అని ధీమా వున్నా, ఇటీవల వదిలిన అమ్మడు..కుమ్ముడు పాట చూసిన తరువాత, ముందుగా అభిమానులకు డవుట్ వస్తోందట.

ఓవర్ సీస్ జనాలు ఇలాంటి మాస్ మసాలాలకు వీలయినంత దూరంగా వుంటారు. ధృవ సినిమా సబ్జెక్ట్ , దాని మేకింగ్ లో అనవసరపు మాస్ మసాలాలు జోడించకపోవడం వంటి వ్యవహారాలు దానికి వన్ మిలియన్ రావడానికి దోహదం చేసాయి.

కత్తి సినిమా ఓవర్ సీస్ జనాలకు అంతగా పట్టేది కాదు. పైగా దానికి బాగా కమర్షియల్ వ్యవహారాలు జోడించారు. బ్రహ్మానందం కామెడీ ట్రాక్, అమ్ముడు కుమ్ముడు లాంటి పాటలు వాటిలో కొన్ని. పైగా అదే సమయంలో శాతకర్ణితో పాటు, శతమానం భవతి సినిమాలు విడుదలవుతున్నాయి.

శతమానం భవతికి కచ్చితంగా ఓవర్ సీస్ విజేత కావడానికి అన్ని లక్షణాలు వున్నాయి. మరి ఈ మూడు సినిమాల బ్యాక్ డ్రాప్ లో ఖైదీ సినిమా వన్ మిలియన్ చేయకపోతే, మెగా ఇమేజ్ కు డ్యామేజ్ నే. ఇదే మెగాభిమానులను కలవరపెడుతోందట.