ఇప్పటి ట్రెండ్ ను బట్టి, బన్నీ తో సినిమా నిర్మించే చాన్స్ అంటే జాక్ పాట్ లాంటిదే. మాంచి ఊపు మీద వుంది బన్నీ కెరీర్. ఈ నెల మూడున వెల్లడించాం..బన్నీ-వక్కంతం వంశీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా మొదలైపోయాయి అని. ఇప్పుడు అదే విషయం మెల్లగా బయటకు వచ్చింది. నిర్మాతగా లగడపాటి శ్రీధర్ అని కూడా. ఇదే నిజమైతే లగడపాటి జాక్ పాట్ కొట్టినట్లే.
సినిమా అంటే విపరీతమైన పిచ్చి వున్న లగడపాటి శ్రీధర్ సరైన సినిమా, సరైన హిట్ లేకుండా వున్నారు చాలా కాలంగా. ఇప్పుడు ఇది చాన్స్ అనుకోవాలి. బన్నీ తన సినిమాల విషయంలో మంచి ప్లానింగ్ తో వున్నారు. ఒక సినిమా ఫినిష్ అవుతుంటే మరో సినిమా పట్టాలెక్కిస్తున్నారు.
ఒక పక్క లింగుస్వామిని, విక్రమ్ కుమార్ ను లెైన్లో వుంచుకున్నారు. వారు ఖాళీ అయ్యేలోగా ఊరుకోకుండా హరీష్ శంకర్ తో, ఇప్పుడు వక్కంతం వంశీతో సినిమాలు ప్లాన్ చేసేస్తున్నాడు. ఇవన్నీ చాలక, ఇంకా ఒకరిద్దరు యంగ్ డైరక్టర్లతో టచ్ లో వున్నాడు. సరైన స్క్రిప్ట్ దొరికితే వాళ్లతో కూడా రెడీ.