మహర్షి సినిమా విడుదలయై 11 రోజులు దాటింది. రెండో శనివారం, రెండో ఆదివారం కూడా పూర్తయ్యాయి. సినిమా విడుదలయిన తరువాత మిక్స్ డ్ రిపోర్ట్ వచ్చినా, కలెక్షన్లు జోరు, ట్రెండ్, టైమ్ చూసి, ఫస్ట్ వీక్ కు బ్రేక్ ఈవెన్ అయిపోతారు బయ్యర్లు అన్నీ భావం కలిగింది. మహా అయితే ఫస్ట్ వీక్ దాటిన తరువాత వచ్చే శని, ఆదివారాలు కలిపి బయ్యర్లను గట్టెక్కిస్తాయి అని అనుకున్నారు.
కానీ ఇంకా చాలా ఏరియాల్లో బయర్లు బ్రేక్ ఈవెన్ కు కాస్త దూరంగానే వున్నారు.
అయితే ఈవారం కూడా థియేటర్లలో సరైన సినిమా లేదు.ఈ వారం అంతా కూడా మహర్షి సినిమానే సినిమా లవర్స్ కు సింగిల్ ఆప్షన్. నైజాం ఇప్పటికే లాభాల బాట పట్టింది. సీడెడ్ మాత్రం చాలా దూరంగా వుండిపోయింది.
ఈస్ట్, వెస్ట్, గుంటూరు, ఈవారం చివరకు కాస్త దగ్గరకు చేరవచ్చు. నెల్లూరు కూడా అదే రేంజ్ లో వుంది. కానీ చాలా చోట్ల డైలీషేర్ అయిదారు లక్షల్లో వుంది. అందువల్ల ఈ వారం కూడా దాటాల్సిన అవసరం వుంది. కానీ ఈవారం దాటితే మాత్రం చిన్నా, మీడియం సినిమాలు చాలా వస్తున్నాయి. పైగా సెలవులు అయిపోతున్నాయి. అందువల్ల ఎలా వుంటుందో చూడాలి.
నైజాం……….24.70 (22.00)
సీడెడ్…………8.10 (12 కోట్లు)
వైజాగ్………….8.00 (9 కోట్లు)
ఈస్ట్…………….6.20 (6.80)
వెస్ట్……………..4.91 (5.70)
కృష్ణ…………….4.94 (6.00)
గుంటూరు…….6.95 (7.70)
నెల్లూరు……….2.33 (2.80)