మహేష్‌బాబు క్లీన్‌ బౌల్డ్‌

సూపర్‌స్టార్‌ అయినా కానీ కమర్షియల్‌ చిత్రాలతో, వినోదాత్మక సినిమాలతో కాలక్షేపం చేయడం మహేష్‌కి ఇష్టముండదు. కొత్తదనాన్ని కోరుకునే మహేష్‌బాబు నటుడిగా ఛాలెంజింగ్‌ రోల్స్‌ ఇష్టపడతాడు. కథల్లో కొత్తదనం కోసం అన్వేషిస్తాడు. కొన్ని ఫ్లాపులు వచ్చినా…

సూపర్‌స్టార్‌ అయినా కానీ కమర్షియల్‌ చిత్రాలతో, వినోదాత్మక సినిమాలతో కాలక్షేపం చేయడం మహేష్‌కి ఇష్టముండదు. కొత్తదనాన్ని కోరుకునే మహేష్‌బాబు నటుడిగా ఛాలెంజింగ్‌ రోల్స్‌ ఇష్టపడతాడు. కథల్లో కొత్తదనం కోసం అన్వేషిస్తాడు. కొన్ని ఫ్లాపులు వచ్చినా కానీ మహేష్‌ ఇంకా అదయితే మానుకోలేదు. 

1 నేనొక్కడినేతో రీసెంట్‌గా మరో డిజాస్టర్‌ చవి చూసినా కానీ మహేష్‌ అలాంటి ప్రయోగాలు చేయడం మాననని అంటున్నాడు. కొత్త రకం కథతో సినిమా తీసి హిట్‌ కొట్టిన మనం దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ని మహేష్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. అతనితో వర్క్‌ చేయడానికి రెడీ అని కూడా కాల్‌ చేసి చెప్పాడట. 

మహేష్‌ కోసం తన మదిలో ఉన్న ఒక స్టోరీ ఐడియాని విక్రమ్‌ కుమార్‌ ఇన్‌స్టంట్‌గా చెప్తే మహేష్‌ క్లీన్‌బౌల్డ్‌ అయిపోయాడట. డెవలప్‌ చేయమని చెప్పాడని, ఫ్యూచర్‌లో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ఫిలింనగర్‌ టాక్‌. కొత్తదనమున్న కథని వినోదాత్మకంగాను చెప్పగల టాలెంట్‌ ఉంది కనుక మహేష్‌తో విక్రమ్‌ చేసే సినిమా కమర్షియల్‌గా రాంగ్‌ అవదని ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చు.