మళ్లీ మ్యాజిక్ చేయగలడా?

అనిల్ రావిపూడి మాస్ పల్స్ తెలిసిన యంగ్ డైరక్టర్. ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఎంటర్ టైన్ మెంట్, మాస్ ఎలిమెంట్స్ సమపాళ్లలో రంగరించడం అన్నది అనిల్ రావిపూడి…

అనిల్ రావిపూడి మాస్ పల్స్ తెలిసిన యంగ్ డైరక్టర్. ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఎంటర్ టైన్ మెంట్, మాస్ ఎలిమెంట్స్ సమపాళ్లలో రంగరించడం అన్నది అనిల్ రావిపూడి బలం. అయితే తొలిసారి మాస్ ఎలిమెంట్స్ పక్కనపెట్టి, క్లాస్ కామెడీ జోనర్ లో అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది ఎఫ్ 2 పబ్లిసిటీ మెటీరియల్ అంతా చూస్తుంటే.

విక్టరీ వెంకటేష్ తో కామెడీ పండించడం అంత సులువుకాదు. అలా అని వెంకీకి కామెడీ టైమింగ్ లేదనికాదు. అక్కడ చాలా లెక్కలు వుంటాయి. ఆయనకు అంటూ కొన్ని ఇష్టాలు, కొన్ని స్టయిళ్లు వుంటాయి. వాటిని చూసుకుంటూనే కామెడీ పండించుకుంటూ రావాలి. మారుతి లాంటి డైరక్టర్ ఎందరితోనో కామెడీ పండించగలిగారు కానీ బాబు బంగారంలో వెంకీతో అంతగా పండించలేకపోయారు.

పైగా వెంకీతో మల్టీస్టారర్ అంటే కూడా అంత వీజీ కాదు. సమతూకం రావడం అన్నది కష్టం. రామ్ తో ఒకసారి చేసారు. తూకం సరిపోలేదు. ఇప్పుడు వరుణ్ తేజ పాత్ర ఏ మేరకు వుంటుంది అన్నది కీలకం. ఎందుకంటే ఈ జనరేషన్ కు వెంకీ కన్నా వరుణ్ నే ముఖ్యం.

పైగా వెంకీ గడచిన నాలుగేళ్లలో చేసినవి రెండే సినిమాలు. ఫ్యామిలీలకు వెంకీ, యూత్ కు వరుణ్ కావాలి. ఇద్దరినీ సమపాత్రల్లో చూపించగలిగితేనే సినిమాకు ప్లస్ అవుతుంది. కానీ వెంకీ దగ్గర అది పాజిబుల్ అయిందా అన్నది అనుమానం.

ఎఫ్ 2కి మరో సమస్య ఏమిటంటే మెహరీన్. ఆమె కామెడీ పండించలేదు. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ అంతంత మాత్రం. మరో హీరోయిన్ తమన్నా మాత్రం కామెడీకి ఒకె. ఇలా ప్లస్సులు, మైనస్సులు లెక్కలు వేసుకుంటే, ఈసారి అనిల్ రావిపూడికి కాస్త గట్టి పరీక్షనే ఎఫ్ 2 ద్వారా ఎదురవుతోంది.

అయితే అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ ఏదీ అని ప్రశ్నిస్తే టక్కున వచ్చే సమాధానం ఎఫ్ 2నే. 

చంద్రబాబును దింపడమే నా లక్ష్యం… ఆయన్ను అసహ్యించుకుంటున్నారు 

అప్పట్నుంచి ఇండియాలో పోర్న్ వీక్షణ పెరిగింది!