'ఎఫ్ 2'లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించినప్పటికీ ఓవరాల్‌గా వెంకటేష్ డామినేషన్ ఎక్కువ వుంటుందనే టాక్ బాగా వినిపిస్తోంది. అనిల్ రావిపూడి ఈసారి కమర్షియల్ మసాలాల జోలికి పోకుండా ఫ్యామిలీ డ్రామాని, వినోదాన్ని బాగా పండించాడట. దీంతో కామెడీలో వెంకటేష్ మిగిలిన వారందరినీ టోటల్‌గా డామినేట్ చేసాడట.
వరుణ్ తేజ్‌కి కామెడీతో అంతగా టచ్ లేకపోవడంతో బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం అయ్యాడట. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా కూడా అధికంగా వుంటుందని, ఆ సీన్లు కూడా వెంకటేష్‌కి కొట్టిన పిండి కావడంతో వరుణ్ తేజ్ బ్లర్ అయిపోయాడని చెప్పుకుంటున్నారు.
వెంకటేష్‌లాంటి సీనియర్‌తో కలిసి నటించడానికి అంతగా అనుభవం లేని వరుణ్ నిర్ణయించుకోవడం సాహసమే. అందులోను ఎంత పెద్ద స్టార్‌తో నటించినా కానీ తన రేంజ్ మెయింటైన్ చేయాలని వెంకటేష్ కండిషన్ పెడుతుంటాడు.
అటు అనుభవంలో కానీ, ఇటు అభినయంలో కానీ వెంకటేష్‌కి సమవుజ్జీ కాని వరుణ్ తేజ్ క్యారెక్టర్‌ని ముందు అనుకున్న దాని కంటే తగ్గించారని, కేవలం పాటలు సమానంగా పంచడం మినహా మిగతా అన్నిట్లోను వెంకీదే పైచేయి అని చెబుతున్నారు.
అంతరిక్షంతో కింద పడ్డ వరుణ్ తేజ్ ఈ చిత్రంలో తన ఉనికిని చాటుకుని తనదైన ముద్ర వేయగలిగితే బాగానే వుంటుంది కానీ వెంకీ ముందు నిలబడలేకపోయాడని అనిపించుకుంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడతాడు.