వరుసగా నాలుగైదు డిజాస్టర్లు ఇచ్చిన తరువాత మణిరత్నం ఇప్పుడు ఓకె కణ్మణి (ఓకె బంగారం) తీస్తున్నారు. మళ్లీ భారతం, రామాయణం, బైబిల్ లను రీ మిక్స్ చేయడం మాని, ఈసారి జాగ్రత్తగా లవ్ స్టోరీ తీస్తున్నట్లు కనిపిస్తోంది. సఖి తరువాత ఆయన మాంచి లవ్ స్టోరీ టచ్ చేయలేదు.
పైగా ప్రతి సారీ ఆయన మద్రాసు టాకీస్ మీద సినిమా నిర్మించడం, అది డిజాస్టర్ కావడం, బయ్యర్ల నిరసనలు, నిరాహార దీక్షలు మామూలే. అందుకే ఆయన ఈసారి తన సినిమాను తమిళనాట సింగిల్ బయ్యర్ కు ఇచ్చేసారు. స్టూడియో గ్రీన్ సంస్థ మణి సినిమా తమిళ థియేటర్ హక్కులు చేజిక్కించుకుంది. ఇక ఏమైనా గడబిడ వస్తే, మణి, స్టూడియో గ్రీన్ మధ్యనే.
తెలుగులో ఈ సినిమాను ఓకె బంగారం పేరిట దిల్ రాజు అందిస్తున్న సంగతి తెలిసిందే. వేటూరితోనే తన సినిమాలకు ఎక్కువగా పాటలు రాయించుకున్నారు. వేటూరి పోయాక, పాటల సంగతి పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాకు పాటల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారు. సీతారామశాస్త్రిని ఎన్నుకున్నారు.