మారేడిమిల్లికి మెగాస్టార్

కరోనా పుణమ్యా అని హీరోలు, డైరక్టర్లకు మన లోకల్ లోకేషన్లు తెగ ముద్దొచ్చేస్తున్నాయి. గతంలో వేరే రాష్ట్రాలు తప్ప మన లోకేషన్లు కనిపించేవి కావు. ఇప్పుడు మన ప్రాంతాలే సేఫ్ అనిపిస్తున్నాయి.  Advertisement బన్నీ-సుకుమార్…

కరోనా పుణమ్యా అని హీరోలు, డైరక్టర్లకు మన లోకల్ లోకేషన్లు తెగ ముద్దొచ్చేస్తున్నాయి. గతంలో వేరే రాష్ట్రాలు తప్ప మన లోకేషన్లు కనిపించేవి కావు. ఇప్పుడు మన ప్రాంతాలే సేఫ్ అనిపిస్తున్నాయి. 

బన్నీ-సుకుమార్ పుష్ప సినిమా కోసం మారేడిమిల్లి అడవులే మాంచి లోకేషన్ గా మారిపోయాయి. అక్కడే కంటిన్యూగా షూటింగ్ జరుగుతోంది.

త్వరలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా అక్కడికే వెళ్లబోతున్నారు. ఆచార్య సినిమా షూట్ కోసం. ఆచార్య సినిమాలో మెగాస్టార్ నక్సల్ బ్యాక్ గ్రవుండ్ సీన్లు కొన్ని వున్నాయి. వాటి చిత్రీకరణ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 

పుష్ప సినిమాకు గ్యాప్ ఇచ్చిన టైమ్ లో మెగాస్టార్ మూవీ షూట్ వుంటుంది. ఆ తరువాత మళ్లీ పుష్ప సినిమా షూట్ వుంటుంది.

ఆచార్య సినిమా కోసం రెండు మూడు రోజులు చరణ్ వర్క్ చేసి, సోలో సీన్లు కొన్ని పూర్తి చేసారు. మారేడిమిల్లిలో కాంబినేషన్ సీన్లు తీస్తారు. ఆ తరువాత మళ్లీ హైదరాబాద్ లో సోలో సీన్లు చిత్రీకరిస్తారు. ఈ గ్యాపుల్లో ఆర్ఆర్ఆర్ షూట్ లో పాల్గొంటారు.

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

గెరిల్లా యుద్దమే చేయాలి