Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మరీ ఇంత నెగిటివ్ నా?

మరీ ఇంత నెగిటివ్ నా?

రానురాను సినిమాలకు ఫ్యాన్స్, కులాలు శాపంగా మారుతున్నాయేమో అనిపిస్తోంది. ఈ సినిమాను వాళ్లు, వాళ్ల సినిమాను వీళ్లు సోషల్ మీడియాను వాడుకుని, తమ చిత్తానికి నెగిటివ్ ప్రచారం సాగించడం మరీ మితిమీరిపోతోంది ఈ మధ్య. లేటెస్ట్ గా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు విషయంలో సోషల్ మీడియాలో సాగుతున్న వ్యతిరేక ప్రచారం ఇంతా అంతా కాదు.

కథానాయకుడు సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ నే వచ్చింది. కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా, ఫేస్ బుక్, వాట్స్ అప్ ల్లో కథానాయకుడులోని బాలయ్య బృహన్నల గెటప్ ను తీసుకుని, విపరీతంగా డిజైన్లు తయారు చేసి, రకరకాల కామెంట్లతో వదిలారు.

మహానటి సినిమాతో పోలుస్తూ, రకరకాల పోస్ట్ లు చలామణీ అయ్యాయి. వాస్తవానికి కొన్ని గెటప్ లు ఎలావున్నా, కొన్ని గెటప్ లు సూటయ్యాయి. కానీ ఒక్క బృహన్నల గెటప్ పట్టుకుని, సినిమాకు వీలయినంత నెగిటివ్ ఫ్రచారం సాగించారు.

గత కొంతకాలంగా బాలకృష్ణపై అన్యాపదేశంగా పవన్ సోదరుడు నాగబాబు చేస్తున్న సోషల్ నెట్ వర్క్ దాడి నేపథ్యంలో బయోపిక్ కు ఓ వర్గం నుంచి నెగిటివ్ ప్రచారం వస్తుందని ముందుగానే ఊహించారు. అదే జరిగింది. అయితే ప్రచారం ఎవరు చేసారు? ఏవర్గం చేసింది? కాపు సామాజిక వర్గమా, మెగా ఫ్యాన్స్ నా? వైకాపా వర్గాలా? అన్నది తెలియదు కానీ, నెగిటివ్ ప్రచారం మాత్రం ముమ్మరంగా సాగింది.

మరోపక్క సినిమాను ఫేస్ బుక్ లో, యూట్యూబ్ లో పెట్టే ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా మూడు టీమ్ లను పెట్టడంతో వాటిని అడ్డుకున్నారు. మొత్తంమీద పాజిటివ్ టాక్ వచ్చినా, రేటింగ్ లు వచ్చానా, రెండోరోజు కలెక్షన్లు డ్రాప్ కావడం వెనుక కారణాల్లో ఈ నెగిటివ్ ప్రచారం ఒకటి అని యూనిట్ జనాలు భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?