పవన్ కళ్యాణ్‌కి అత్యంత ఆప్తుడిగా మారిపోయి, అతడికి అనుక్షణం నీడలా ఉంటోన్న త్రివిక్రమ్ ఇప్పుడు పవన్‌తో రాజకీయాల్లో కూడా అడుగు పెట్టిస్తున్నాడని, ఈ డైరెక్షన్ అంతా త్రివిక్రమ్‌దేనని ఒక టాక్ ఉంది. పవన్‌కి ఉన్న సామాజిక స్పృహ, అతనికి ఉన్న ఆలోచనలు నాలుగ్గోడల మధ్య ఉండిపోరాదని, ప్రజలకి డైరెక్ట్‌గా సేవ చేయడానికి ముందుకి రావాలని ప్రోత్సహించింది త్రివిక్రమేనట.
ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ చొరవ చూపించి ఎరుగని పవన్‌కి బ్రెయిన్ వాష్ చేసిందీ, ఇప్పుడు అన్నయ్యకి పూర్తిగా ఎదురు వెళ్లేటట్టు చేస్తోందీ కూడా పరోక్షంగా త్రివిక్రమే కావడం మెగా ఫ్యామిలీకి నచ్చడం లేదట. గతంలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కానీ కుటుంబానికి పవన్ పూర్తిగా దూరం కాలేదట. కానీ ఈసారి మాత్రం పవన్ కుటుంబంలోని అందరికీ దూరమవుతున్నాడని, దానికి త్రివిక్రమ్ సావాసమే కారణమని మెగా ఫ్యామిలీ నమ్ముతోందని పుకార్లు వినిపిస్తున్నాయి.
పార్టీ పెట్టేసే వరకు పవన్ సిద్ధమవుతున్నాడంటే ఇంత తెగింపు తనకి ముందు లేదని, ఎంత ఎదిగినా కానీ అన్నయ్య చాటు తమ్ముడిగానే ఉండడానికి ఇష్టపడేవాడని, కానీ త్రివిక్రమ్‌తో స్నేహం పెరిగాక ఎవరినీ లెక్క చేయకుండా అతడు డైరెక్ట్ చేసినట్టు నడుచుకుంటున్నాడని, అతడిని ప్రభావం నుంచి తప్పించడం కాదు కదా… పవన్‌తో ఇప్పుడు మామూలుగా మాట్లాడడం కూడా ఎవరి వల్ల కావడం లేదట. అంతగా హిప్నటైజ్ అయిపోయాడట.