మెగా కోడలికు ఫుల్ మార్కులు

మెగాస్టార్ 60వ పుట్టిన రోజు వేడుకలు ముగిసాయి. టాలీవుడ్ లో కాస్త పేరు వుంది అన్న ప్రతి ఒక్కరిని పిలిచారు. ఇక నేషనల్ లెవెల్ సెలబ్రిటీల సంగతి చెప్పనక్కరేలేదు. ఫంక్షన్ చాలా గ్రాండ్ గా,…

మెగాస్టార్ 60వ పుట్టిన రోజు వేడుకలు ముగిసాయి. టాలీవుడ్ లో కాస్త పేరు వుంది అన్న ప్రతి ఒక్కరిని పిలిచారు. ఇక నేషనల్ లెవెల్ సెలబ్రిటీల సంగతి చెప్పనక్కరేలేదు. ఫంక్షన్ చాలా గ్రాండ్ గా, జోష్ తో, కలర్ ఫుల్ గా జరిగింది.

ఈ ఫంక్షన్ కు సంబంధించి పూర్తి క్రెడిట్ ఇటు ఇంట్లోనూ, అటు బయట కూడా మెగాస్టార్ కోడలికే దక్కిందట. ఈ ఫంక్షన్ వెనుక ప్లానింగ్ అంతా రామ్ చరణ్ వైఫ్ ఉపాసనదే నంట. కేవలం ప్లానింగ్ మాత్రమే కాకుండా, మామగారి బర్త్ డే సందర్భంగా అటు ఇంటికి కానీ, ఇటు ఫంక్షన్ కు వచ్చిన వారిని పేరు పేరునా పలకరించి, అతిథిమర్యాదలు చేసి, వారి నుంచి ఫుల్ మార్కులు కొట్టేసిందట ఉపాసన.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంటర్యూలలో, 'మా కోడలు బంగారం' అంటూ కితాబిచ్చారు. అదే విథంగా అతిథలు కూడా మెగాస్టార్ కోడలు నిజంగా స్టారే..అనేసారట. మొత్తానికి ఉపాసన ఫుల్ మార్కులు సంపాదించేసింది కోడలుగా.