మూడడుగుల బుల్లెట్టు

పవన్‌కళ్యాణ్‌ ఆరడుగుల బుల్లెట్టు అయితే తాను మూడడుగుల బుల్లెట్‌నని అంటున్నాడు కామెడీ కింగ్‌ బ్రహ్మానందం. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకి బ్యాక్‌బోన్‌గా నిలిచిన బ్రహ్మానందంకి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందరు…

పవన్‌కళ్యాణ్‌ ఆరడుగుల బుల్లెట్టు అయితే తాను మూడడుగుల బుల్లెట్‌నని అంటున్నాడు కామెడీ కింగ్‌ బ్రహ్మానందం. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకి బ్యాక్‌బోన్‌గా నిలిచిన బ్రహ్మానందంకి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందరు హీరోల అభిమానుల్ని ఒక్కటి చేసే వారధి బ్రహ్మీ అని చెప్పవచ్చు. 

అయితే బ్రహ్మీ క్రేజ్‌ని సరిగ్గా వాడుకున్న సినిమా ఇంతవరకు రాలేదు. బ్రహ్మానందం హీరోగా పలువురు సినిమాలు తీసినప్పటికీ ఆయన నుంచి ఆశించే స్థాయి కామెడీని పండించలేకపోయారు. హీరోగా పలుమార్లు ఫెయిలైనా కానీ ఇంకా బ్రహ్మానందం హీరోగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. 

ప్రస్తుతం బ్రహ్మానందంతో ‘మూడడుగుల బుల్లెట్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ చిత్రం వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. భారీ లెవల్లో ఒకేసారి ఈ ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌ చేస్తారట. బ్రహ్మానందంకి హీరోగా హిట్టిచ్చే సినిమా ఇదే అవుతుందనే ధీమాతో ఉన్నారు రూపకర్తలు.