అయ్యో సాహో.. ఎందుకిలా జరిగింది?

సాహోకు సంబంధించి రీసెంట్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో సంగీత దర్శకుల పేర్లు వేయలేదు. అప్పుడే అందరికీ కాస్త అనుమానం వచ్చింది. పొరపాటున మరిచిపోయి ఉంటారని అంతా సర్దుకున్నారు.  తాజాగా ఈరోజు…

సాహోకు సంబంధించి రీసెంట్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో సంగీత దర్శకుల పేర్లు వేయలేదు. అప్పుడే అందరికీ కాస్త అనుమానం వచ్చింది. పొరపాటున మరిచిపోయి ఉంటారని అంతా సర్దుకున్నారు. 
తాజాగా ఈరోజు కూడా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. గమ్మత్తుగా ఈ పోస్టర్ లో కూడా మ్యూజిక్ డైరక్టర్స్ పేర్లు లేవు. దీంతో అందరికీ అనుమానాలు పెరిగాయి.

అయితే అవి అనుమానాలు కావు, నిజాలే అనే విషయం తేలడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. పోస్టర్ ఇలా రిలీజ్ అయిందో లేదో, మరోవైపు నుంచి ట్వీట్ పడింది. సాహో సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా ఆ సినిమా మ్యూజిక్ డైరక్టర్లు శంకర్-ఎహసాన్-లాయ్ ప్రకటించారు.

“మా అభిమానులందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాం. సాహోకు సంగీతం అందించడం లేదు. ఆ సినిమా నుంచి తప్పుకున్నాం.” ఇలా ఒక్కసారిగా బాంబ్ పేల్చింది ఈ సంగీత త్రయం. దీంతో సాహో యూనిట్ లో ఏదో జరిగిందనే విషయం నిర్థారణకొచ్చింది.

నిజానికి సాహో సినిమాకు సంబంధించి 5 పాటల కంపోజింగ్ పూర్తయింది. వీటిలో 2 పాటల్ని చిత్రీకరించారు కూడా. ఇక ఓ యాక్షన్ ఎపిసోడ్ కు వీళ్లు రీ-రికార్డింగ్ కూడా ఇచ్చారు. ఇలా దాదాపు 70శాతం పని పూర్తయిన తర్వాత మ్యూజిక్ డైరక్టర్లు తప్పుకోవడం సాహో యూనిట్ ను ఇరకాటంలో నెట్టేసింది.

సాహో కోసం శంకర్-ఎహసాన్-లాయ్ ఇచ్చిన ఔట్ పుట్ ను వాడుకుంటారా లేక పూర్తిగా ఆ మెటీరియల్ ను పక్కనపెట్టి మరో సంగీత దర్శకుడికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, సాహో సినిమాకు ఈ త్రయం అందించిన మ్యూజిక్ యథాతథంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న వర్క్ ను జిబ్రాన్ లేదా తమన్ తో పూర్తిచేయబోతున్నారు. ఇలా చేయకపోతే ఆగస్ట్ 15కు సినిమా రిలీజ్ అవ్వదు మరి.

వైఎస్ జగన్ సక్సెస్ ఫార్ములా అదే!