నాగ్‌ దగ్గర కథలు ఉడకడం లేదు

బాల నాగార్జున.. నాగ చైతన్యకు ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తున్న ఓ హిట్‌ ‘తడాఖా’తో ఇచ్చాడు డాలీ. రీమేక్‌ సినిమానే అయినా, తన ప్రతిభతో తనకు రావల్సిన మార్కులు తెచ్చుకొన్నాడు. ఈ సినిమా చూసి నాగార్జున…

బాల నాగార్జున.. నాగ చైతన్యకు ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తున్న ఓ హిట్‌ ‘తడాఖా’తో ఇచ్చాడు డాలీ. రీమేక్‌ సినిమానే అయినా, తన ప్రతిభతో తనకు రావల్సిన మార్కులు తెచ్చుకొన్నాడు. ఈ సినిమా చూసి నాగార్జున కూడా ఫ్లాటైపోయి, తరువాతి సినిమా డాలీతోనే అని ప్రకటించేశాడు. అయితే ఆ సినిమా ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. కారణం.. కథ సెట్‌ కాకపోవడమేనట. 

ఇప్పటి వరకూ డాలీ నాగ్‌కి ఓ అరడజను కథలు వినిపించాడట. అందులో ఒక్కటీ నాగ్‌కి నచ్చలేదని సమాచారమ్‌. కొన్ని సినిమాల్ని రీమేక్‌ చేయాలనే ఆలోచన కూడా వచ్చిందట. కానీ నాగ్‌ ససేవిూరా అనడంతో కొత్త కథలు రాసుకోవడంలో పడిపోయాడు డాలీ. 

ఓ కథ రాసుకోవడం, నాగ్‌కి వినిపించడం, నచ్చకపోవడం ` ఇలా టైమ్‌ అంతా వేస్ట్‌ అయిపోతుండడంతో డాలీకీ విసుగొచ్చిందట.  నాగార్జున కాకపోతే మరో హీరో దొరుకుతాడులే.. అనే స్థితికి వచ్చేశాడట. ఇంకో కథ రిజెక్ట్‌ అయితే.. అన్నపూర్ణ కాంపౌండ్‌ నుంచి డాలీ బయటకు వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చేతిలో బెల్లంకొండలాంటి నిర్మాత, నాగార్జున లాంటి హీరో ఉన్నా ` సినిమా మొదలు కాకపోవడం కంటే విడ్డూరం ఏముంది.? 

అన్నట్లు ఈ సమస్య ఒక్క డాలీకే కాదు చాలా మంది దర్శకులు నాగార్జున దగ్గర ఎదుర్కొంటున్నారు. ఒక పట్టాన కథలు నచ్చడం లేదట. ఇది భయంతో వచ్చిన జాగ్రత్త అని సినిమా జనం గుసగుసలాడుతున్నారు.