నలిగిపోయి, నలిగిపోయి, రంగు వెలసిపోయింది అనుకున్నారంతా నాని జెండాపై కపిరాజు సినిమాను. ఎందుకంటే, ఇదిగో విడుదల, అదిగో విడుదల అనడమే కానీ, రావడం కనిపించలేదు. ఆఖరికి ఈనెల 21న నాని సినిమాకే పోటీగా రెడీ అయింది. ఏమిటీ కాన్ఫిడెన్స్?
Advertisement
తమిళనాట ఇప్పటికే విడుదలై, జనాల చేత నో..నో అనిపించేసుకుంది కదా అనుకుంటే..అసలు వైనం వేరే అని తెలుస్తోంది. తమిళనాట విడదలయ్యాక, ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం మైనస్ లు సరిచేసారట. కత్తిరింపులు, జోడింపులు లాంటి కార్యక్రమాలతో పాటు, నేపథ్య సంగీతం కాస్త ఆసక్తికరంగా మార్చారట. అంటే జెండాను ఉతికి ఇస్త్రీ చేసారన్న మాట,.