గబ్బర్ సింగ్ 2 సినిమాకు హీరోయిన్ కావలెను. ఇప్పడు ఇదే ప్రయత్నంపై యూనిట్ అంతా కొత్త అమ్మాయిల ఫొటోలను తెగపరిశీలిస్తోంది. నిజానికి దీపిక పడుకునే కోసం తెగ ప్రయత్నించారు. పవన్ సరసన ఆమె అయితే సినిమాకు మాంచి క్రేజ్ వస్తుందని భావించారు. కానీ ఆమె సుముఖంగానే వున్నా, తేదీలు సరిపోవడం లేదు. జనవరి నుంచి నెలకు ఒక వారం మాత్రమే ఇవ్వగలనని అనడంతో, ఇక ఆశలు వదిలేసుకుని, పూర్తిగా కొత్త అమ్మాయిని ఎంపిక చేయాలని నిర్ణయంచేసుకున్నట్లు తెలిసింది.
దీనికి ముంబాయి ప్రొఫైల్ ఏజెన్సీ ఒకటి సహకరిస్తోంది. ఇందుకోసం ముంబయ్ ముద్దుగుమ్మల ఫొటోలు ముందేసుకుని కుస్తీ పడుతున్నారు. బహుశా ఇది కొలిక్కి వస్తే, నవంబర్ రెండు, మూడో వారాల్లో క్లాప్ కొట్టే అవకాశం వుంది. మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు పవన్ పక్కన దీపికను చూసే అవకాశం మిస్సయినట్లే.