ఎన్‌టిఆర్‌ ఆత్మఘోష: మంచోళ్ళెవరు.? ముంచిందెవరు.?

స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆత్మఘోష మరోమారు తెరపైకి వచ్చింది. ఆయన మరణించి చాలా ఏళ్ళే అయినా.. ఆయన మరణం వెనుక అసలు 'కారణం'పై ఇప్పటికీ భిన్న వాదనలు విన్పిస్తూనే వున్నాయి. రాజకీయ వెన్నుపోటు కారణంగానే…

స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆత్మఘోష మరోమారు తెరపైకి వచ్చింది. ఆయన మరణించి చాలా ఏళ్ళే అయినా.. ఆయన మరణం వెనుక అసలు 'కారణం'పై ఇప్పటికీ భిన్న వాదనలు విన్పిస్తూనే వున్నాయి. రాజకీయ వెన్నుపోటు కారణంగానే మానసికంగా కుంగిపోయి, స్వర్గీయ నందమూరి తారకరామారావు తుదిశ్వాస విడిచారన్నది నిర్వివాదాంశం. ఆ రాజకీయ వెన్నుపోటుకి కారణం, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడే. కానీ, ఆనాటి ఆ వెన్నుపోటు ఎపిసోడ్‌కి 'నాయకత్వ మార్పు' అని పాలిష్డ్‌ పేరు పెట్టేశారు చంద్రబాబు.

ఓ వైపు 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌', ఇంకోవైపు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'.. ఇలా రెండు సినిమాలు తెలుగు సినీ పరిశ్రమలోనూ, తెలుగునాట రాజకీయాల్లోనూ హాట్‌ టాపిక్‌ అయిన దరిమిలా, సోషల్‌ మీడియా వేదికగా, ఆనాటి ఆ సంఘటనల గురించిన చర్చ చాలాజోరుగా సాగుతోంది. ఒకప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. నిజం దాచేస్తే దాగిపోయే రోజులు ఒకప్పుడున్నాయి. ఆ కారణంగానే, ఎన్టీఆర్‌ ఆత్మఘోష ఎవరికీ తెలియలేదు. ఇప్పుడలా కాదు.. సోషల్‌ మీడియా కడిగి పారేస్తోంది.

'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' ట్రైలర్‌ వచ్చింది. 'ఎన్‌టిఆర్‌ కథనాయకుడు', 'ఎన్‌టిఆర్‌ మహానాయకుడు' చిత్రాలకు సంబంధించి ఒకే ట్రైలర్‌, ఒకే ఆడియో రిలీజ్‌ నిన్ననే చేసేశారు. నిన్ననే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' నుంచి 'వెన్నుపోటు' పాట కూడా వచ్చింది. 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' వేదికపై చాలామంది ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు కన్పించారు. అందరూ, ఎన్‌టిఆర్‌ గొప్పతనం గురించి చెప్పారు తప్ప, ఎవరూ ఎన్టీఆర్‌ తన చివరిరోజుల్లో అనుభవించిన మానసిక వేదన గురించి చెప్పలేదు.

సినీనటుడు మోహన్‌బాబు మాత్రం, పరోక్షంగా ఆనాటి కొన్ని పరిస్థితుల గురించి చూచాయిగా ప్రస్తావించారు. 'చెడ్డోళ్ళను కూడా మంచోళ్ళుగా చూపించినట్టున్నారు' అన్న అనుమానం ఆయన మాటల్లో వ్యక్తమయ్యింది. కాస్సేపు దర్శకుడు క్రిష్‌తోపాటు, అక్కడున్నవారంతా అవాక్కయ్యారు మోహన్‌బాబు మాటలతో. నో డౌట్‌.. తెలుగునాట స్వర్గీయ ఎన్టీఆర్‌ ఓ చరిత్ర. కానీ, ఆ చరిత్ర చెప్పే క్రమంలో కొన్ని పేజీలే చూపిస్తామంటే ఎలా.?

ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులు ఎలా వ్యవహరించారు.? ఎన్టీఆర్‌ రాజకీయంగా ఎలా ఒంటరి అయ్యారు.? మానసికంగా ఎందుకు కుంగిపోయారు.? వంటి అంశాలకూ సమాధానాలు ఈ 'బయోపిక్‌' చెప్పాల్సి వుంటుంది. అలా బయోపిక్‌లో ఏమీచెప్పరు గనుకనే, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' వస్తోందన్నది ఇంకో వాదన.

'ఇవిగో సాక్ష్యాలు..' అంటూ అప్పట్లో స్వర్గీయ ఎన్టీఆర్‌ మాట్లాడిన మాటల తాలూకు వీడియోలు, పేపర్‌ కటింగ్స్‌.. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న దరిమిలా.. ఇవన్నీ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'కి బోల్డంత ఊతమిస్తాయి.

ఎన్టీఆర్‌ని గొప్పోడిగా చూపించడం పెద్ద విషయమేమీ కాదు.. ప్రపంచానికి తెలియని, వెలుగులోకి రానివ్వని సంఘటనల్ని చూపించడమే అసలు 'కిక్‌'. మరి, ఆ దిశగా వర్మ సక్సెస్‌ అవుతాడా.?  వేచి చూడాల్సిందే.

పడి పడి లేచె మనసు… పడి… మళ్లీ లేవలేదు! ఎందుకో తెలుసా? 

భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా