పవన్‌కళ్యాణ్స్‌ బిగ్గెస్ట్‌ హిట్‌

  Advertisement విడుదలకి ముందు, తర్వాత కూడా అనేక అవాంతరాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ‘అత్తారింటికి దారేది’ చిత్రం రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా అరవై కోట్ల రూపాయల షేర్‌ కలెక్ట్‌ చేసి చరిత్ర…

 

విడుదలకి ముందు, తర్వాత కూడా అనేక అవాంతరాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ‘అత్తారింటికి దారేది’ చిత్రం రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా అరవై కోట్ల రూపాయల షేర్‌ కలెక్ట్‌ చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఆది లేదా సోమవారాల్లో తెలుగు చిత్ర చరిత్రలో ఆల్‌టైమ్‌ సెకండ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా అవతరించనుంది.

ప్రస్తుతం ఆల్‌టైమ్‌ హిట్స్‌ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న ‘గబ్బర్‌సింగ్‌’ రికార్డుని ‘అత్తారింటికి దారేది’ అధిగమించనుంది. ‘రామయ్యా వస్తావయ్యా’ విడుదలైనా కానీ ‘అత్తారింటికి దారేది’ వసూళ్లపై ప్రభావం అంతగా పడలేదు. ఆ చిత్రానికి నెగెటివ్‌ టాక్‌ రావడం, ఫ్యామిలీస్‌కి నచ్చదనే రిపోర్టులతో పండక్కి ‘అత్తారింటికి దారేది’ మరింత లాభపడనుంది.

ఫుల్‌ రన్‌లో ‘మగధీర’ ఆల్‌ టైమ్‌ రికార్డుకి కొన్ని కోట్ల దూరంలో ఇది నిలిచిపోతుందని ట్రేడ్‌ టాక్‌. అయినప్పటికీ వరుసగా రెండేళ్లలో రెండు సార్లు అరవై కోట్లకి పైగా షేర్‌ రాబట్టి పవర్‌ స్టార్‌ తన స్టార్‌ పవర్‌ ఏమిటనేది చూపించాడు. ఈ చిత్రం సమంతకి, త్రివిక్రమ్‌కి కూడా కెరీర్‌ బెస్ట్‌ హిట్‌గా నిలిచింది.