రామయ్యకి తుఫాన్‌ దెబ్బ

ఎన్టీఆర్‌ సినిమా మొదటి రోజు వసూళ్లు ఊపేస్తున్నాయి. ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా… థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. అయితే ఈ వసూళ్లు ఎన్ని రోజులు కొనసాగుతాయనేదే కీలకమైన ప్రశ్న.  Advertisement మరోవైపు ఫైలిన్‌ తుఫాన్‌…

ఎన్టీఆర్‌ సినిమా మొదటి రోజు వసూళ్లు ఊపేస్తున్నాయి. ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా… థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. అయితే ఈ వసూళ్లు ఎన్ని రోజులు కొనసాగుతాయనేదే కీలకమైన ప్రశ్న. 

మరోవైపు ఫైలిన్‌ తుఫాన్‌ కూడా ఈ సినిమాకి శాపంలా పరిణమించింది. ఈ తుఫాను ప్రభావం కోస్తాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుందట. మరి కొన్ని గంటల్లో తీరం దాటనున్న ఫైలిన్‌ వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పెను తుఫానుగా మారనుంది. 

ముందు జాగ్రత్త చర్యగా  కొన్ని జిల్లాల్లో శనివారం సెలవు కూడా ప్రకటించారు. ఈ ఎఫెక్ట్‌ రామయ్యపై కూడా పడనుంది. అసలే డివైడ్‌ టాక్తో కొట్టిమిట్టాడుతున్న రామయ్యకి… ఇది పెద్ద దెబ్బే.