సెట్టైర్‌లు వేస్తున్నాడో, లేదంటే నిజంగా పవన్‌పై ఆ స్థాయిలో అభిమానం ఉందో ఏమో తెలియదు కానీ… రామ్‌గోపాల్ వర్మ ఓ రేంజ్‌లో ఎత్తేస్తున్నాడు. ఒకసారి గాంధీ మహాత్ముడితో పోలుస్తాడు. మరోసారి శివసేన పార్టీ కంటే వెయ్యి రెట్లు జనసేన అంటాడు. ఇప్పుడైతే ఏకంగా మనిషంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే అంటాడు. ఇంతకీ రామ్‌గోపాల్ వర్మ మనసులో ఏముందో, ఆయన ఆలోచనేమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
అంటే లోకంలో పవన్‌కళ్యాణ్ ఒక్కడే మనిషైతే… ఇక మిగతావాళ్లంతా జంతువులనో ఏంటొ అర్థం కావడం లేదు. మళ్లీ అంతటితో ఆగకుండా… మిగతావాళ్ల గురించి నన్ను అడగొద్దు అని ట్వీట్ చేశాడు. మొత్తంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీకి వర్మ తెగ బూస్టప్ ఇస్తున్నాడు వర్మ. పవన్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టాలని తొట్టతొలిగా డిమాండ్ చేసిన వ్యక్తి రామ్‌గోపాల్ వర్మనే.
పవన్ పార్టీ నిర్ణయం తీసుకొన్నాక మళ్లీ ట్విట్టర్‌లో “పవన్‌కి ఓటేయకపోతే మూర్ఖులే“ అని సపోర్ట్‌గా నిలిచాడు. ఇప్పుడు “నాకున్న పరిచయాల ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకొన్న విషయమేమిటంటే… పవన్‌కళ్యాణ్ అనేవాడు ఒక్కడే మనిషి“ అంటూ ట్వీట్ చేశాడు. మనసులో అభిమానముంటే ఎత్తేయొచ్చు కానీ… మరీ ఈ రేంజ్‌లో ఎత్తేయడమేంటి అని చెవులు కొరుక్కొంటున్నారు. మరికొందరేమో వర్మ సెటైర్‌లు వేస్తున్నాడంటూ మాట్లాడుకొంటున్నారు.