హార్ట్ ఎటాక్ విషయంలో పూరి జగన్నాథ్ బ్రాండ్ కంటే, నితిన్ కి ఉన్నక్రేజే ఎక్కవగా గిట్టుబాటు అవుతోంది. ఈ సినిమా మార్కెట్ పూర్తిగా నితిన్ పేరుమీదే జరుగుతుంది అనడం కూడా అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే పూరి గత ఫ్లాప్స్ బయ్యర్లను భయపెడుతోంది.
అందుకే నితిన్‌ని చూసి ఈ సినిమా కొనడానికి వస్తున్నారు. తాజాగా హార్ట్ ఎటాక్ శాటిలైట్ రేటు కూడా మంచి ధరకే అమ్ముడు పోయింది. రూ.4.5 కోట్లకు ఈ సినిమా రైట్స్‌ని జెమిని ఛానల్ కొనుగోలు చేసేసింది. నితిన్ సినిమాల్లో ఇదే మంచి రేట్. సినిమానీ మంచి రేట్లకే అమ్ముకొంటున్నాడు పూరి.
ఇది తన సొంత సినిమానే. అందుకే నిర్మాతగానూ లాభాలను సంపాదించే మార్గాలు అన్వేషించాడు పూరి. ఆవిషయంలో సక్సెస్ అయ్యాడు కూడా. మరి అదే స్థాయిలో బయ్యర్లకు కూడా హార్ట్ ఎటాక్ లాభాలు సంపాదిస్తే, అంతకంటే ఏం కావాలి..?