తమిళంలో విజయ్ నటించిన సినిమా కోసం ముగ్గురు టాప్ హీరోలు తాపత్రయపడుతున్నారు. విజయ్ హీరోగా వచ్చిన జిల్లా తమిళనాట మంచి వసూళ్లు దక్కించుకొంది. మాస్, యాక్షన్ మిక్చర్‌గా వచ్చిన ఈ కథ.. తెలుగు ప్రేక్షకులకూ తప్పకుండా నచ్చుతుందని ఇక్కడివాళ్ల నమ్మకం. అందుకే తెలుగులో రీమేక్ చేయడానికి భారీగా కసరత్తులు జరుగుతున్నాయి.
ఓ దర్శకుడు ఈ కథను పట్టుకొని ముగ్గురు హీరోల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడట. ముందుగా ఈ కథ రామ్‌చరణ్‌కి వినిపించినట్టు సమాచారమ్. మధ్యలో మహేష్‌బాబుకీ ఈ సినిమా చూపించే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఎన్టీఆర్ రేసులోకి వచ్చాడు.
విజయ్ పాత్ర ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కి సరిగ్గా సూటవుతుందని భావిస్తున్నారట. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై ఆరా తీస్తున్నాడట. ఒకవేళ ఎన్టీఆర్ జిల్లా సినిమాను చేయడానికి రెడీగా ఉంటే… వెంటనే రీమేక్ రైట్స్ సొంతం చేసుకొనే అవకాశాలున్నాయి. మరి ఈ ముగ్గురి హీరోల్లో చివరాఖరికి జిల్లా చేసే మొనగాడెవ్వడో..?