పూరి కిందా మీదా..

లోఫర్ సినిమాను నిలబెట్టడానికి దర్శకుడు పూరి జగన్నాధ్ కిందా మీదా పడుతున్నాడు. సినిమాను తీసినపుడు, ఫ్యామిలీ ప్రేక్షకుల కోసం పది పైసల జాగ్రత్తలు కూడా తీసుకోని, ఆయన, ఇప్పుడు ఛానెళ్లలో కూర్చుని, లోఫర్ ను…

లోఫర్ సినిమాను నిలబెట్టడానికి దర్శకుడు పూరి జగన్నాధ్ కిందా మీదా పడుతున్నాడు. సినిమాను తీసినపుడు, ఫ్యామిలీ ప్రేక్షకుల కోసం పది పైసల జాగ్రత్తలు కూడా తీసుకోని, ఆయన, ఇప్పుడు ఛానెళ్లలో కూర్చుని, లోఫర్ ను ఓ కుటుంబ కథా చిత్రంగా ప్రొజెక్టు చేయడానికి కిందా మీదా పడుతున్నారు. 

లోఫర్ పేరును మార్చడానికి ఇష్టపడని పూరి, ఇప్పుడు మా అమ్మ మహాలక్ష్మి, మా నాన్న లోఫర్ అంటూ క్యాప్షన్లు చూపించి, మహిళలను థియేటర్లకు రప్పించాలని చూస్తున్నారు. ఈ జాగ్రత్త ఏదో ముందే తీసుకుని, తల్లిని కొడుకు చంపే సీన్, అతిగా అనిపించే సీన్లు, డైలాగుల దగ్గర జాగ్రత్త పడి వుంటే బాగుండేది కదా? కుటుంబ ప్రేక్షకులు హాయిగా చూడగలిగేవారు. భీకరమైన విలన్ మొహాలు, మాటలు, చేతలు పెట్టి, ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తారు?