మహర్షి సినిమా ముందు ఒకటే టెన్షన్. నిర్మాతల్లో ఇద్దరు దిల్ రాజు, పివిపి మొత్తం భారాన్ని తమపై వేసుకున్నారు. సినిమాను నైజాంకు ఇరవై కోట్ల రేంజ్ లో తీసుకోవాలి అనుకుంటే ఇరవై ఆరుకోట్ల రేంజ్ లో కిట్టుబాటు అయింది. రిస్క్ చేద్దాం. ఏమయితే అయింది అనే దిల్ రాజు, పివిపి ముందుకు అడుగేసారు. స్క్రిప్ట్ తయారుచేయించుకున్న ధీమా పివిపిది, దగ్గర వుండి సినిమా తీయించుకున్న నమ్మకం దిల్ రాజుది.
ఇప్పుడు ఈ నమ్మకం, ధీమా గెలిచాయి. నైజాంలో ఇప్పటికే 16 నుంచి 17 కోట్ల మధ్య షేర్ వచ్చిందన్నది నిర్మాణ వర్గాలు చెబుతున్న సంగతి. లాంగ్ రన్ లో ఇప్పుడు ఈ సినిమా ముఫై కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఓవర్ ఫ్లోస్ ఫుల్ గా కుమ్మేస్తాయన్నమాటే.
ఇక సినిమా ను దిల్ రాజు, పివిపి ఎక్కడా అమ్మలేదు. అన్ని ఏరియాలు, ఓవర్ సీస్ తో సహా మినిమమ్ గ్యారంటీ మీద ఇచ్చారు. అంటే ఓవర్ ఫ్లోస్ అన్నీ వాళ్లవే. నెల్లూరు లాంటి చిన్న సెంటర్ తో సహా అన్ని సెంటర్లలో ఓవర్ ఫ్లోస్ ఫుల్ గా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇంకో పాతిక కోట్లు వచ్చేస్తే తెలుగు రాష్ట్రాల్లో గ్యారంటీలు వెనక్కు వచ్చేస్తాయి.
ఆపైన వచ్చినదాంట్లో కమిషన్ పోను నిర్మాతలకు ఓవర్ ఫ్లోస్ అన్నమాట. ఈ లెక్కన పివిపికి, దిల్ రాజుకు మాంచి లాభాలు వచ్చే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. పివిపికి కనీసం ఏడు కోట్లు లాభాలు రావాలి. అలావస్తే ఆయన ఫుల్ హ్యాపీ. ఈ ప్రాజెక్టు ఆయనకు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అలాగే దిల్ రాజుకు కూడా అప్పుడు ఏడుకోట్లు లాభం వస్తుంది.
ప్రస్తుతం సినిమాలు కూడా పెద్దగా లేవు. సీత ఒక్కటే కాస్త చెప్పుకోదగ్గ సినిమా. అందువల్ల మరో రెండు మూడువారాల పాటు మహర్షిదే థియేటర్లలో హవా అనుకోవాలి.