Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎబిసిడి ఫన్ ట్రయిలర్

ఎబిసిడి ఫన్ ట్రయిలర్

ఒక్కక్షణం సినిమా తరువాత హీరో శిరీష్ చేస్తున్న సినిమా ఎబిసిడి. దగ్గుబాటి సురేష్ బాబు, మధురశ్రీధర్, యాష్ రంగినేని లాంటి గట్టి పేర్లే వున్నాయి ఈ సినిమా వెనకాల. పైగా మళయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా రీమేక్ కూడా. ఇప్పటికే ఈ సినిమాకు ఓ ట్రయిలర్ కట్ చేసి విడుదల చేసారు. మంచి రెస్పాన్స్ నే వచ్చింది. ఇప్పుడు మరో ట్రయిలర్ కట్ చేసారు. కథలో పాయింట్ ను రివీల్ చేస్తూనే, అవుట్ అండ్ ఫన్ ఎంటర్ టైనర్ అని చెప్పే విధంగా ఈ ట్రయిలర్ ను కట్ చేసారు.

ఈ రెండో ట్రయిలర్ చూసిన తరువాత కథ గురించి ఇక ఎలాంటి సందేహాలు వుండవు. అయితే కథనం ఎలా వుండబోతోంది అన్నది కూడా చెప్పేసారు. అమెరికా నుంచి వచ్చిన కుర్రాడు, ఇండియాలో చేతిలో సరిపడా డబ్బులు లేక, పడిన ఇబ్బందుల్లోంచి పుట్టిన ఫన్ అని ట్రయిలర్ క్లారిటీ ఇచ్చేసింది.

అయితే ట్రయిలర్ లో మొత్తం విషయం పరిచేసారు. చాలావరకు ఫన్ సీన్లు అన్నీ ట్రయిలర్ లో కనిపించేసాయి. మరి సినిమాలో ఏ మేరకు అదనంగా వుంటాయన్నది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?