Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుదర్శన్ థియేటర్ కి మహేష్

సుదర్శన్ థియేటర్ కి మహేష్

మహర్షి సినిమా ప్రమోషన్లలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్ విజిట్ కు వెళ్తారని వెల్లడించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ థియేటర్ విజిట్ కు వెళ్లడం అన్నది అరుదుగా జరిగే సంఘటన. ఈ విషయంలో లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, థియేటర్, డేట్ ఫిక్స్ అయింది.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ ను మహేష్ బాబు సందర్శించబోతున్నారు. ఈ థియేటర్ కు కేవలం ఆడియన్స్ పరంగానే కాకుండా, సినిమా సర్కిళ్లలో కూడా మంచి పేరు వుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో దశాబ్దాల కాలంగా పేరున్న థియేటర్ ఇది. ప్రస్తుతం క్రాస్ రోడ్స్ లో నాలుగు థియేటర్లలో మహర్షి సినిమాను ప్రదర్శిస్తున్నారు.

బహుశా మంగళవారం నుంచి ఒకటి రెండు థియేటర్లు తగ్గించే అవకాశం వుంది. ఫస్ట్ వీకెండ్ ముగిసిపోయినందున షేర్ డివైడ్ అయిపోకుండా థియేటర్లు సర్దుబాటు చేయడంలో భాగంగా, తగ్గించడం అన్నది కామన్.

ఇదిలావుంటే మహర్షి ప్రమోషన్లలో భాగంగా మహేష్ ఓ పబ్లిక్ స్కూలును కూడా విజిట్ చేసి అక్కడ విద్యార్థులతో ఫార్మింగ్ మీద ముచ్చటిస్తారు. అలాగే 40 మంది రైతులతో ముచ్చటించిన విడియో ఒకటి రెడీ చేసారు. అది విడుదల చేస్తారు. 18న విజయవాడ ఫంక్షన్ నిర్వహిస్తారు.

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?