అనుకొన్నంత అయ్యింది. ఆగిపోయిన రాధా.. ఇక ఎప్పటికీ రానంత చిక్కుల్లో పడింది. ఈ సినిమా ఇక మొదలయ్యే ఛాన్స్ లేదని ఫిల్మ్‌నగర్ వాసులు చెప్పుకొంటున్నారు. ఈ సినిమా కథలో మొదలైన వివాదం.. తెగే సూచనలు కనిపించడం లేదని, రెండు పక్షాలూ పట్టుపట్టడంతో చిక్కుముడి బిగుసుకొందని తెలుస్తోంది. వెంకీ కూడా ఈ సినిమాని లైట్ తీసుకొన్నారట.
ఇప్పుడాయన దృశ్యం రీమేక్‌లో బిజీగా ఉన్నారు. దానితో పాటు ఓమైగాడ్పై దృష్టి పెట్టారు. ఇక రాధ.. ప్రస్తావన తీసుకురావొద్దని సోదరుడు సురేష్‌బాబుకు క్లియర్ కట్‌గా చెప్పారట. రాధ కథ మాదే అని ఇద్దరు యువకులు రచయితల సంఘంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫిల్మ్‌నగర్‌లో కొంతమంది పెద్దమనుషులు… ఫిర్యాదుదారులకు అనుకూలంగా పనిచేస్తున్నారని… డి.సురేష్‌బాబుపై కోపం ఉన్నవాళ్లంతా కలసికట్టుగా ఫిర్యాదు దారుల వెన్నండి ఉండి నడిపిస్తున్నారట.
ఈ కథ విషయం ఇక తేలదనుకొన్న మారుతి కొత్త కథ రాసుకొనే పనిలో పడ్డాడు. అయితే వెంకీ మాత్రం.. రాధా ప్రాజెక్టు పక్కన పెట్టడమే మంచిదని భావిస్తున్నాడు. సో.. రాధ.. ఇక రాదని తేలిపోయినట్టే.