రాజాసాబ్ …మూడు గంటల సినిమా?

సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ బెస్డ్ హర్రర్ టచ్ తో వుంటుంది. ఈ మధ్య కాలంలో ఫ్రభాస్ ను ఫన్ మోడ్ లో చూసి చాలా కాలం అయింది.

ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమా టాకీ ఆల్ మోస్ట్ పూర్తయింది. పాటలు మాత్రం వున్నాయి. వేస్టేజ్ లేకుండా, బడ్జెట్ లిమిట్స్ దాటకుండా సినిమా తీస్తారు దర్శకుడు మారుతి. అయినా కూడా రాజాసాబ్ టాకీ లెంగ్త్ మూడు గంటల ముఫై నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ఇంకా పాటలు జోడించాలి. అంటే ఎలా లేదన్నా కొంత భాగం ఎడిట్ లో తీసేయాల్సిందే.

పాటలు జోడించిన తరువాత తీసిన టోటల్ ఫుటేజ్ మూడు గంటల 45 నిమిషాలకు చేరుతుంది. ఎంత అదనపు షాట్లు, వేస్టేజ్ తీసేసినా కనీసం మూడు గంటలు అయితే వుంచాల్సి వుంటుంది. సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ బెస్డ్ హర్రర్ టచ్ తో వుంటుంది. ఈ మధ్య కాలంలో ఫ్రభాస్ ను ఫన్ మోడ్ లో చూసి చాలా కాలం అయింది. పైగా చాలా మంది కమెడియన్లు ఈ సినిమాలో వున్నారు. సప్తగిరి, సత్య, ప్రభాస్ శ్రీను, ఇలా చాలా మంది వున్నారు.

ప్రభాస్ పూర్తిగా తన పాన్ ఇండియా హీరోయిజం పక్కన పెట్టేసి, కమెడియన్లతో కలిసి ఫన్ పండించినట్లు తెలుస్తోంది. త్వరలో విడుదల చేయబోయే టీజర్ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ఓ కామన్ యాక్టర్ మాదిరిగా దెయ్యం నటించడం టీజర్ లో చూపించే అవకాశం వుంది.

2 Replies to “రాజాసాబ్ …మూడు గంటల సినిమా?”

Comments are closed.