కేశవ సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. సినిమా ఫస్టాఫ్ సూపర్ గా ఉందన్నారు. సెకెండాఫ్ డల్ అయిందన్నారు. రివ్యూస్ పక్కనపెడితే కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. శుక్ర, శని, ఆదివారాలు ఈ సినిమా అన్ని ఏరియాస్ లో బ్రహ్మాండంగా ఆడింది. మరి ఈరోజు నుంచి సినిమా సంగతేంటి..?
ఎంత హైప్ తో వచ్చిన సినిమాకైనా సోమవారం వచ్చిందంటే కష్టకాలమే. అందరూ ఆఫీసులు, కాలేజీలు అంటూ బిజీగా ఉంటారు. మరి ఇలాంటి టైమ్ లో కూడా థియేటర్లకు రావాలంటే సినిమాలో స్టఫ్ బాగుండాలి. లేదంటే ఎక్స్ ట్రా హంగులైనా చొప్పించాలి. ప్రస్తుతం కేశవ టైం అదే పనిలో ఉంది. సినిమా రన్ టైం ఎలాగూ తక్కువగా ఉంది కాబట్టి.. కుదిరితే అదనంగా ఇంకొన్ని సీన్లు యాడ్ చేయాలనే ప్లాన్ లో ఉంది.
ఇప్పటికే వచ్చిన యావరేజ్ టాక్ తో కేశవ సినిమా వర్కింగ్ డేస్ లో నడవడం కష్టమే. ప్రస్తుతం ఈ సినిమాకు రెండే ఆశాదీపాలు. ఒకటి బాహుబలి-2 తప్ప మరో సినిమా పోటీలో లేకపోవడం. రెండోది అదనంగా ఇంకొన్ని సీన్లు యాడ్ చేయడం. ఈ రెండు అంశాలపైనే కేశవ కలెక్షన్లు ఆధారపడి ఉన్నాయి.
కేశవకు మరో వీకెండ్ అడ్వాంటేజ్ కూడా లేదు. ఎందుకంటే ఈ వీకెండ్ నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా వస్తోంది. సో.. ఎంత కాదనుకున్నా కేశవ సినిమాకు అది అంతో ఇంతో పోటీ ఇవ్వక మానదు. కేశవకు థియేటర్లు తగ్గక మానవు.