రెండు పడవలపై మెగాస్టార్?

ఒక పక్క పూరి ఫస్టాఫ్ వరకు కథ చెప్పాను..ఒకె అన్నారు చిరు..అంటూ ట్వీట్ చేస్తాడు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి, సూపర్ డైరక్టర్ వి వి వినాయక్ తో సిట్టింగ్ ల మీద సిట్టింగ్ లు…

ఒక పక్క పూరి ఫస్టాఫ్ వరకు కథ చెప్పాను..ఒకె అన్నారు చిరు..అంటూ ట్వీట్ చేస్తాడు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి, సూపర్ డైరక్టర్ వి వి వినాయక్ తో సిట్టింగ్ ల మీద సిట్టింగ్ లు వేస్తున్నారు. అక్కడా కథ ఓ కోలిక్కి వచ్చిందని వినికిడి.  మరి ఇంతకీ 150 వ సినిమాడైరక్టర్ ఎవరని? మెగా ఫ్యాన్స్ మాత్రం వినాయక్ తో వెళ్తేనే బాగుంటుందని అంటున్నారట. వినాయక్ సిట్టింగ్ లు గురించి బయటకు వచ్చాక, పూరి కథ ఫస్టాఫ్ ఓకె అయిందని ట్వీట్ చేసాడు.

అంటే రామ్ చరణ్ తన ప్రాజెక్టు పూరితో వుంటుందని ప్రకటించేనాటికి కథ ఓకే కాలేదన్నమాట. అంటే కథ లేకుండానే ఆటోజానీ టైటిల్ తోనే పూరికి మెగాస్టార్ చాన్సిచ్చారని అనుకోవాలి. అంటే మళ్లీ 150వ సినిమాకు మొదట్నీంచీ వస్తున్న సమస్యే. కథ.
 
బహుశా వినాయక్ కు మంచి లైన్ తట్టి చెప్పి వుంటాడని, దాంతో మెగాస్టార్ అటు మొగ్గి వుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండుకథలు రెడీ చేయిస్తున్నరని, ఏది నచ్చితే వారికి డైరక్షన్ చాన్స్ వుంటుంది మరో టాక్. అయితే అభిమానుల వత్తిడికి తల వోగ్గితే మాత్రం వినాయక్ నే డైరక్టర్ అని అంటున్నారు.