సాహో స్పీడ్‌ పెంచాలి

సాహో చిత్రానికి తెలుగు బిజినెస్‌ వరకు ఢోకా ఉండదనేది ఈ చిత్రానికి జరుగుతోన్న ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చెబుతోంది. బాహుబలికి ముందు వున్న ప్రభాస్‌ మార్కెట్‌ ఇప్పుడు మూడింతలయింది. అప్పట్లో టాప్‌ హీరోల సినిమాలతో…

సాహో చిత్రానికి తెలుగు బిజినెస్‌ వరకు ఢోకా ఉండదనేది ఈ చిత్రానికి జరుగుతోన్న ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చెబుతోంది. బాహుబలికి ముందు వున్న ప్రభాస్‌ మార్కెట్‌ ఇప్పుడు మూడింతలయింది. అప్పట్లో టాప్‌ హీరోల సినిమాలతో ప్రభాస్‌ చిత్రాలకి సమానమైన విలువ వుండేది కాదు కానీ ఇప్పుడు టాప్‌ హీరోలు ఎవరికీ ప్రభాస్‌ రేంజ్‌ లేదని తేలిపోయింది. తెలుగు వెర్షన్‌ వరకు సాహోకి ఢోకా లేదు కానీ ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో ప్రభావం చూపించాలంటే మాత్రం పబ్లిసిటీ పెంచాలి.

టీజర్‌ విడుదల చేసి, దానికి వచ్చిన మిలియన్ల వ్యూస్‌ చూసుకుని ముచ్చట పడిపోవడం కాకుండా బాలీవుడ్‌ చిత్రాలని  ఏ స్థాయిలో ప్రమోట్‌ చేస్తుంటారో అధ్యయనం చేయాలి. ముఖ్యంగా బాహుబలి చిత్రానికి ప్రమోషన్స్‌ ఎంత జోరుగా సాగేవనేది గుర్తు చేసుకోవాలి. ప్రమోషన్స్‌ పరంగా సాహో చాలా వీక్‌గా వుందనే విమర్శలు వస్తున్నాయి.

చివరకు ప్రభాస్‌ అభిమానులు కూడా పబ్లిసిటీ చాలదని, బాహుబలి క్రేజ్‌పై బ్లయిండ్‌గా ఆధారపడిపోకుండా ఈ చిత్రానికి వున్న మెరిట్స్‌ని ప్రమోట్‌ చేసుకోవాలని చెబుతున్నారు. ఆగస్ట్‌ 15న విడుదల ఖాయమని చెబుతోన్న సాహో నిర్మాతలు ఇంతవరకు ఒక్క పాట కూడా విడుదల చేయలేదని అభిమానులు వాపోతున్నారు. 

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా  సినిమా రివ్యూ: కల్కి