సాహో… ఈ బజ్ సరిపోతుందా?

బంగారపు పళ్లానికైనా గోడ చేర్పు కావాలి అన్నది సామెత. ఎంత పెద్ద సినిమా అయినా ప్రచారం కీలకం. దాని వల్ల వచ్చే బజ్ కీలకం. ఆ బజ్ కారణంగా వచ్చే కలెక్షన్లు కీలకం. అయితే…

బంగారపు పళ్లానికైనా గోడ చేర్పు కావాలి అన్నది సామెత. ఎంత పెద్ద సినిమా అయినా ప్రచారం కీలకం. దాని వల్ల వచ్చే బజ్ కీలకం. ఆ బజ్ కారణంగా వచ్చే కలెక్షన్లు కీలకం. అయితే బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహో మాత్రం అలా అనుకుంటున్నట్లు కనిపించడం లేదు. సాహో అన్న టైటిల్, సినిమా చాలు అని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిస్థితి గురించి యువి క్రియేషన్స్ అంత పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. సినిమా కోసం బాలీవుడ్, హాలీవుడ్ టీమ్ లను పెట్టుకున్న సాహో యూనిట్ ప్రచారం కోసం కూడా బాలీవుడ్ యూనిట్ మీద డిపెండ్ అయింది. వారు వారి స్టయిల్ లో ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. అది తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఏ మాత్రం చేరుతున్నట్లు కనిపించడం లేదు.

ఇప్పటి వరకు సరైన స్టిల్స్ లేవు. తెలుగు జనాలకు సూటయ్యే ప్రచారం లేదు. నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుండడంతో, పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫుల్ బిజీ అయిపోయారు. పబ్లిసిటీని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. బాలీవుడ్ టీమ్ ఏది చేస్తే దాన్ని తెలుగులో డబ్ చేసి వదలడం తప్ప మరోటిలేదు.

టీజర్ వదిలారు. రెండు రోజులు హడావుడి. ఆపైన మరి లేదు. ఇప్పుడు పాట వదలబోతున్నారు. రెండు రోజులుగా ఒకటే స్టిల్. మరోటిలేదు. ఒకటే డిజైన్ మరోటి లేదు. సాహో టైటిల్, భారీతనం ఈటాక్ సినిమాకు ఓపెనింగ్స్ తెస్తే తేవచ్చు. కానీ ఈ క్రేజ్ చాలదు. తెలుగునాట ఆ సినిమాకు రావాల్సిన వసూళ్లు తక్కువేమీ కాదు. బాహుబలి వన్ ను మించి రావాలి. కానీ ఆ దిశగా యువి సంస్థ ఆలోచనలు చేస్తున్నట్లు లేదు.

సినిమాకు సంబంధించిన విశేషాలు కానీ, అప్ డేట్స్ కానీ, ఎప్పటికప్పుడు అందించడం వంటి హడావుడి ఏదీ పీఆర్ టీమ్ చేయడంలేదు. బాలీవుడ్ టీమ్ నే ఇవన్నీ చూసుకోవడం వల్ల ఇక్కడి లోకల్ టీమ్ చేతులు కట్టేసినట్లు అయింది. సాహో సినిమాను దాదాపు దేశం అంతా ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎంత భారీగా ప్రచారం చేయాలో? బాహబలికి, రజనీ సినిమాలకు వచ్చిన మాస్ హిస్టీరియాలాంటి ప్రచారం సాగాలి. అప్పుడే సాహోకి భయంకరమైన ఓపెనింగ్స్ వస్తాయి.

కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం చూస్తుంటే, ఓ మామూలు పెద్ద సినిమా రేంజ్ లో కూడా ప్రచారం సాగడంలేదు.

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?