జగన్ మార్క్.. మొదలైంది గమనించారా..?

రాష్ట్రంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ చలాన్లు మోగిపోతున్నాయి. ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు ఏవీ పనిచేయడం లేదు. ఆడవాళ్లే కదా లైసెన్స్ లేకపోయినా వదిలేద్దామనే నిర్లిప్తత పోలీసుల్లో లేదు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు, నిబంధనలు పాటించని వాహనదారులపై…

రాష్ట్రంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ చలాన్లు మోగిపోతున్నాయి. ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు ఏవీ పనిచేయడం లేదు. ఆడవాళ్లే కదా లైసెన్స్ లేకపోయినా వదిలేద్దామనే నిర్లిప్తత పోలీసుల్లో లేదు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు, నిబంధనలు పాటించని వాహనదారులపై కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు పోలీస్ సిబ్బంది. జిల్లా ఎస్పీల ఆదేశాల ప్రకారమే ఈ పరివర్తన మొదలైంది.

షీ టీమ్స్ రంగంలోకి దిగడంతో పోకిరీల ఆగడాలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు మార్కెట్లో ప్లాస్టిక్ క్యారీబ్యాగులు క్రమంగా మాయమైపోతున్నాయి. ప్లాస్టిక్ కవర్లు ఉంటే లంచం తీసుకుని వదిలేసే రోజులు పోయాయి. మున్సిపల్ సిబ్బంది ఈ దఫా కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ పనితీరు గమనించారా.. ఇప్పటికే బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపారు. అక్రమంగా మద్యం నిల్వచేస్తే కటకటాల వెనక్కు నెడుతున్నారు. ఊరూవాడా మద్యం వల్ల కలిగే అనర్థాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగుల తీరులో చెప్పలేని మార్పు కనిపిస్తోంది. అర్జీలు పట్టుకుని ఆఫీస్ లకు వచ్చేవారిని గతంలోలా చీదరించుకునే రోజులు పోయాయి. కొత్తగా పేరు మార్చుకున్న స్పందన కార్యక్రమంలో చెప్పలేనంత మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారికోసం షామియానాలు, కుర్చీలు, మంచినీటి సౌకర్యం.. అర్జీలు రాయడానికి వాలంటీర్లు.. ఇదంతా ఒక వారం ముచ్చట కాదు.. ప్రతివారం పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు గట్టిగా చెబుతున్నారు.

స్వయంగా జిల్లా కలెక్టర్లు ప్రతి మండలంలోనూ స్పందన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక పల్లెనిద్ర కూడా అనుకున్నదానికంటే సూపర్ హిట్ అనిపించుకుంది. ఉన్నతాధికారులు బస చేసిన హాస్టళ్లలోనే కాదు, చెకింగ్ ల భయంతో మిగతా ప్రభుత్వ హాస్టళ్లలో కూడా సౌకర్యాలు మెరుగయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సిబ్బంది టైమ్ టు టైమ్ వస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులలో కూడా జవాబుదారీతనం పెరిగింది.

ఇవీ స్థూలంగా నెలరోజుల జగన్ పరిపాలనలో ప్రతి సామాన్యుడూ గమనించిన, గమనిస్తున్న మార్పులు. ఒకరకంగా జగన్ ఆదేశాలను, ఆయన తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను ఐఏఎస్, ఐపీఎస్ లు తూచా తప్పకుండా అమలు చేయడం వల్లే ఈ మార్పు మొదలైంది. ప్రజావేదిక కూలగొట్టారు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు అంటూ గగ్గోలు పెడుతున్న పచ్చ బ్యాచ్ కి ఈ మార్పు కూడా కనిపిస్తే బాగుండు. 

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?