సమంత టూర్ మొదలైంది

మొత్తానికి త్రివిక్రమ్ కు సమంత నచ్చేసింది. దాంతో ఆమె మెగా టూర్ మొదలైంది. బాబాయ్ శ్రుతి హసన్ తో నటిస్తే, అబ్బాయి కూడా ఆడిపాడేసాడు. మేనల్లుడు కూడా రెడీ అయిపోయాడు.  Advertisement ఇప్పుడు బాబాయ్…

మొత్తానికి త్రివిక్రమ్ కు సమంత నచ్చేసింది. దాంతో ఆమె మెగా టూర్ మొదలైంది. బాబాయ్ శ్రుతి హసన్ తో నటిస్తే, అబ్బాయి కూడా ఆడిపాడేసాడు. మేనల్లుడు కూడా రెడీ అయిపోయాడు. 

ఇప్పుడు బాబాయ్ సమంతతో ఆడి పాడేసరికి, మేనల్లుడు కూడా 'నిన్న చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే' అనేసి, తన సినిమాలోకి తీసేసుకున్నాడు. దానికి దర్శకడు త్రివిక్రమ్ కూడా సై అనేసాడు. ఇదంతా త్రివిక్రమ్, అల్లు అర్జున్ రాబోయే సినిమా​ గురించే. 

జులాయి అంటూ తెగ అల్లరి చేసిన ఈ ఇద్దరు, ఇప్పుడు మరో సినిమాకు శ్రీకారం చుట్టేసారు. దాంట్లో హీరోయిన్ గా సమంతకు ఇద్దరూ ఓటేసేసారు. ఇంకేముంది, మెగా క్యాంప్ కు మరో హీరోయిన్ వచ్చేసింది. తమన్నా అయిపోయింది, శృతి తిరిగేసింది. ఇక సమంతం టూర్ మొదలైంది.