ఉన్నట్టుండి వరసగా వార్తల్లోకి వస్తోంది సచిన్ టెండూల్కర్ కూతురు సారా. ఈ పంతొమ్మిదేళ్ల అమ్మాయి ని బాలీవుడ్ కి పరిచయం చేయడానికి కొంతమంది ఉత్సాహం చూపుతున్నారు. అమ్మాయికి హీరోయిన్ ఫీచర్లు అదిరిపోయాయని.. వారి ప్రయత్నాల్లో వారున్నారు. అయితే సచిన్ మాత్రం తనకూతురు సినిమాల్లోకి వస్తుందనే ఊహాగానాలను కొట్టేస్తున్నాడు. ఇటీవల రణ్ వీర్ సింగ్ తో సారా దిగిన ఫొటోలు మళ్లీ ఈమె బాలీవుడ్ ఎంట్రీపై పుకార్లకు ఊపునిచ్చాయి. ఇదిలా ఉంటే.. సినిమాల సంగతేమో కానీ, సచిన్ కూతురికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని బాలీవుడ్ వాలాలు ప్రచారాన్ని మొదలుపెట్టేశారు.
అతడు మరెవరో కాదు.. శిఖర్ పహారియా అనే కుర్రాడు. ఈ కుర్రాడు బాలీవుడ్ పత్రికలకు సుపరిచితుడే. ఇది వరకూ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తో ముద్దులు పెట్టుకుని ఫొటోలు దిగి మీడియాకు కావాల్సినంత మెటీరియల్ ఇచ్చాడే.. అతడే ఇతడు! ఇంతకు మించి పరిచయం చేయాలంటే.. ఈ కుర్రాడు మరెవరో కాదు కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే మనవడు. షిండే కూతురి కొడుకే ఈ శిఖర్. మహారాష్ట్ర రాజకీయ కుటుంబానికి చెందిన నేపథ్యంతో కుర్రాడు దూసుకుపోతున్నాడు. గతంలో శ్రీదేవి తనయతో సన్నిహితంగా మెలిగిన శిఖర్ ఇప్పుడు సారా టెండూల్కర్ కు సన్నిహితుడయ్యాడని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కొంటున్నాయి.
తాజాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అంబానీలు ఇచ్చిన ఒక పార్టీలో సారా, శిఖర్ పహారియాలు చాలా క్లోజ్ గా కనిపించారట. క్రికెట్, బాలీవుడ్ సెలబ్రిటీలెంతో మంది హాజరైన ఈ కార్యక్రమంలో వీరిద్దరూ సన్నిహితంగా నడుచుకున్నారట. దీంతో.. తెల్లారే సరికల్లా వీరి మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అనే ప్రచారం మొదలైంది. మొత్తానికి సచిన్ తనయ ఆసక్తికరమైన రీతిల్లో వార్తల్లోకి వస్తోంది. బాలీవుడ్ ఎంట్రీ అని, బాయ్ ఫ్రెండ్ అని.. సచిన్ కు ఏ మాత్రం సంబంధంలేని రంగాల్లో కూతురు పేరు వినిపిస్తోంది. మరి ఇదెంత వరకూ వెళ్తుందో చూడాలి!